హైదరాబాద్: అసెంబ్లీలో అన్ని పార్టీలు ఏకగ్రీవ తీర్మానం చేశాయని సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అభిషేక్ సింఘ్వీ వాదనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రిజర్వేషన్లు 50% మించొద్దనే వాదన సరికాదని అన్నారు. ఇందిరా సహానీ కేసులోనూ 50% పరిమితి దాటొచ్చని ఉందని తెలియజేశారు. డేటా ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వొచ్చని ఉంది అని సింఘ్వీ పేర్కొన్నారు.