హైదరాబాద్: బిసిలకు చట్ట పరంగా రిజర్వేషన్లు ఇచ్చాకే ఎన్నికలు పెట్టాలని బిఆర్ఎస్ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. స్థానిక ఎన్నికల్లో పార్టీల పరంగా రిజర్వేషన్లు అంగీకరించం అని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుంటే.. నామినేషన్లు వేయకండి అని రిజర్వేషన్లపై మోసగించాలని చూస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఎల్లుండి నిర్వహించే బంద్ కు బిఆర్ఎస్ మద్దతు ప్రకటించిందని, బంద్ కు ఆర్టిసి, మెట్రో, దుకాణాలు, విద్యాసంస్థలు సహకరించాలని కోరారు. రాజకీయాలకు అతీతంగా అందరూ బంద్ లో పాల్గొనాలని, ఎల్లుండి జరగాల్సిన సునీత నామినేషన్ కార్యక్రమం వాయిదా వేశారని తెలియజేశారు. బిసి రిజర్వేషన్లు సుప్రీంకోర్టులో నిలబడవు అని చెబుతూనే ఉన్నామని అన్నారు. అన్ని తెలిసి కూడా కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం డ్రామాలు ఆడాయని తలసాని విమర్శించారు.