మన తెలంగాణ/హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నిక ల్లో బిసిలకు రిజర్యేవషన్ల శాతాన్ని పెంచడం పట్ల హై కోర్టు స్టే విధించడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభు త్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై గురువారం విచారణ జరగనుంది. జస్టిస్ విక్రమ్ నాధ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం విచారించనుంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్ సింఘ్వి ఈ కేసును వాదించనున్నారు. రిజర్వేషన్లపై 50శాతం దాటాకూడదన్న సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా తెలంగాణ ప్రభు త్వం రిజర్వేషన్ల శాతాన్ని పెంచిందని, అందుకు సం బంధించి జారీ చేసిన జీవో నెంబరు 9ని హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. హైకోర్టు ఆదేశాల మేర కు స్థానిక సంస్థల ఎన్నికలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
రిజర్వేషన్లను 50 శాతానికి పరిమితం చేస్తూ రాజ్యాంగంలో ఎక్కడా పరిమితులు విధించలేదని, కేవలం సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ఆధారమే తప్ప ఇందుకు తగిన మార్గదర్శకాలు లేవని హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వా దించింది. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అంతకుమించి రిజర్వేషన్లు కల్పించవచ్చని ఇందిరా సాహ్ని వ ర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, జనహిత్ అభియాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసుల్లో సుప్రీంకో ర్టు చెప్పిందని కూడా ప్రభుత్వం గుర్తు చేసింది. రా ష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించడానికి ముందు ఈ అంశంపై సమ గ్ర, శాస్త్రీయ అధ్యయనం నిర్వహించిన విషయాన్ని స్పె షల్ లీవ్ పిటిషన్‌లో పేర్కొంది. సామాజిక, ఆర్థిక, వి ద్య, ఉద్యోగ, రాజకీయ, కుల సర్వే 2024-25లో రాష్ట్ర జనాభాలో 56.33 శాతం మంది బిసిలు ఉన్నట్లు తేలిందని, 42శాతం రిజర్వేషన్ల కల్పనకు అదే ప్రాతిపదికని వెల్లడించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 342-ఎ(3) కిం ద దాఖలు పడిన అధికరణలను అనుసరించి ప్రభుత్వం ఈ కసరత్తు చేసిందని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం మాదిరిగానే ఇలాంటి కసరత్తును రాహుల్ రమేశ్ వాఘ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసులో సుప్రీంకోర్టు సమర్థించిందని గుర్తు చేసింది.
సమగ్ర కుల సర్వే తర్వాత తెలంగాణ ప్రభుత్వం రిటైర్ట్ ఐఎఎస్ అధికారి వెంకటేశ్వరరావు నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసి ఆ సర్వే డేటాను విశ్లేషించిన విషయాన్ని కూడా తన స్పెషల్ లీవ్ పిటిషన్‌లో పేర్కొంది. బిసిలకు రిజర్వేషన్ల పెంపునకు లోతైన అధ్యయనం చేసిన అనంతరమే బిసిలకు 42 శాతం రిజర్వేషన్లను స్థానిక సంస్థల్లో కల్పించిందని పేర్కొంది. ఆ కమిషన్ చేసిన సిఫార్సులను ప్రభుత్వం ఆమోదించడంతో పాటు తెలంగాణ బిసి రిజర్వేషన్ల బిల్లు -2025 ను శాసనసభ, మండలిలో ఏకగీవ్రంగా ఆమోదించిం దని పేర్కొంది. ఆమోదించిన ఈ బిల్లును గవర్నర్ ఆమోదం కోసం పంపినట్టు సుప్రీం కోర్టుకు నివేదించింది. రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి అన్నది కేవలం వివేకపూర్వకమైన నియమం తప్ప అదేమీ రాజ్యాంగపరమైన నిబంధన కాదని ప్రభుత్వం పేర్కొంది. క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులు, స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పుడు రిజర్వేషన్ల శాతాన్ని పరిమితికి మించి పెంచుకునేందుకు ఇందిరా సాహ్ని తీర్పులో రాజ్యాంగ ధర్మాసనం పేర్కొన్న విషయాన్ని తన పిటిషన్‌లో పేర్కొంది.
జనహిత్ అభియాన్ కేసు తీర్పులోనూ ఈ విషయం ఉందని గుర్తు చేసింది. వీటిని దృష్టిలో ఉంచుకొని జీవో 9 జారీ చేసినట్టు పేర్కొంది. రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులను అసెంబ్లీ ఉభయసభల్లో ఏకగ్రీవంగా ఆమోదించడం ద్వారా వ్యక్తమైన ప్రజాభిప్రాయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది. ఈ జీవోను నిలిపివేస్తూ హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులు అస్పష్టతను ఏర్పరిచాయని, ఒకవైపు జీవోపై స్టే విధించిన హైకోర్టు, మరోవైపు ఎన్నికలపై స్టే విధించడంలో సంయమనం పాటించిందంది. దీంతో పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఇలా చేస్తే వెనుకబడిన తరగతుల వారికి సరిదిద్దలేని నష్టం జరుగుతుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఉత్తర్వులను నిలువరించి, బిసిలకు 42 శాతం రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించుకొనేందుకు అనుమతివ్వండని సుప్రీంకోర్టును రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థించింది. ఈ కేసు గురువారం విచారణకు జరగనుండటంతో సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుపట్ల సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ నెలకొంది. ఇలా ఉండగా గురువారం జరగబోయే మంత్రివర్గ సమావేశంలోనూ ఇదే అంశంపై ప్రధానంగా చర్చ జరనగుంది.