తెలంగాణలో మూడు కొత్త వ్యవసాయ కళాశాలు ఏర్పాటు కానున్నాయి. ఆచార్య జయశంకర్ వర్సిటీకి అనుబంధంగా కాలేజీలు ఏర్పాటు చేయాలని గురువారం రాష్ట్ర కేబినేట్ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఇవాళ సాయంత్రం సచివాలయంలో మంత్రి మండలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కొడంగల్, హుజూర్‌నగర్, నిజామాబాద్ జిల్లాల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి అగ్రికల్చర్ కాలేజీలను పారంభించేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.