మెగా సుప్రీం హీరో సాయిదుర్గ తేజ్ క్రేజీ పాన్ -ఇండియా చిత్రం ఎస్‌వైజి (సంబరాల యేటిగట్టు)తో అద్భుతమైన సినిమాటిక్ అనుభవాన్ని అందించడానికి సిద్ధమవుతున్నారు. నూతన దర్శకుడు రోహిత్ కెపి దర్శకత్వంలో పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ హనుమాన్‌ను అందించిన ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె.నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా రిలీజ్ కానుంది. సాయి దుర్గ తేజ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మేకర్స్ అసుర ఆగమన గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఇది గూస్‌బంప్స్‌ను తెప్పించింది. ఈ ఈవెంట్‌లో దర్శకులు వశిష్ట, దేవకట్ట, విఐ ఆనంద్, నిర్మాత వివేక్ కూచిబొట్ల పాల్గొన్నారు. ఈ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్‌లో మెగా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ మాట్లాడుతూ “నా జీవితంలో చాలా ముఖ్యమైన సినిమా ఇది.
సినిమా కోసం నా సర్వస్వం ధారపోశాను. సినిమా అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను. మా నిర్మాతలు నిరంజన్, చైతన్య ఖర్చుకి వెనకాడకుండా సినిమాను నిర్మించారు. డైరెక్టర్ రోహిత్ చాలా మంచి కథ రాసుకున్నారు. తన విజన్ అందరికీ నచ్చుతుంది. ఇది అద్భుతమైన సినిమా”అని అన్నారు. ప్రొడ్యూసర్ కె నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ “ఈ సినిమా కోసం సాయి దుర్గ తేజ చాలా కష్టపడి పనిచేశారు. ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను”అని తెలిపారు. డైరెక్టర్ రోహిత్ మాట్లాడుతూ “ఈ సినిమా కోసం సాయి దుర్గ తేజ అయినంతగా ట్రాన్స్‌ఫర్మేషన్ మిగతా వారికి అంత సులభం కాదు. అద్భుతమైన టీంతో చేసిన సినిమా ఇది”అని పేర్కొన్నారు. ఈ వేడుకలో పొడ్యూసర్ చైతన్య రెడ్డి, పళని స్వామి తదితరులు పాల్గొన్నారు.