హైదరాబాద్: వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం కొండాపురంలో దారుణం చోటు చేసుకుంది. అన్నదమ్ములకు మధ్య గొడవ వదిన ప్రాణాలు తీశాయి. పోలీసులు తెలిపి వివరాల ప్రకారం… రమేశ్. సురేష్ అన్నదమ్ములు కొండాపురం గ్రామంలో నివసిస్తున్నారు. గత కొంతకాలంగా అన్నదమ్ముల మధ్య ఆస్తి విషయంలో గొడవలు జరుగుతున్నాయి. గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇద్దరు అన్నదమ్ములు కొట్టుకుంటుండగా అడ్డుగా వదిన వచ్చింది. దీంతో ఆమెకు బలమైన గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా ఆమె మృతి చెందింది. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అన్నకు తీవ్రగాయాలు కావడంతో వరంగల్ ఎంజిఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు తమ్ముడు సురేష్ ను అదుపులోకి తీసుకొని పిఎస్ కు తరలించారు.