చండీగఢ్: అవినీతికి సంబంధించిన కేసులో పంజాబ్ పోలీస్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్(డిఐజి) హర్చరన్ సింగ్ భుల్లార్‌ను గురువారం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెష్టిగేషన్(సిబిఐ) అరెస్టు చేసింది. భుల్లార్‌ను మోహాలీలోని ఆయన కార్యాలయంలో అరెస్టు చేసినట్లు అభిజ్ఞవర్గాలు తెలిపాయి. 2007 ఐపిఎస్ బ్యాచ్ ఐపిఎస్ అధికారి అయిన భుల్లార్ డిఐజి(రోపర్ రేంజ్)గా పనిచేస్తున్నారు.రోపర్ రేంజ్‌లో మొహాలీ, రూప్‌నగర్, ఫతేఘడ్ సాహిబ్ జిల్లాలు ఉన్నాయి. భుల్లార్ గతంలో డిఐజి(పాటియాలా రేంజ్)గా పనిచేశారు. ఆయన జాగ్రాన్, మొహాలీ, సంగ్రూర్‌లలో జాయింట్ డైరెక్టర్,విజిలెన్స్ బ్యూరో, సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్‌గా కూడా పనిచేశారు.