జనరల్ ఫండ్‌ను కాజేసిన అధికారులు
జేఏవో ఫిర్యాదుతో అవినీతి బహిర్గతం
విచారణ చేపట్టిన అధికారులు
మన తెలంగాణ/వైరా: అనేక అవినితి ఆరోపణలకు నిలయంగా మారిన వైరా మున్సిపాలిటి కార్యాలయంలో అతి పెద్ద కుంభకోణం బయటపడింది. ఒక లక్ష కాదు.. రెండు లక్షలు కాదు ఏకంగా సుమారు 54 లక్షల రూపాయలు అధికారులు కాజేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మున్సిపాలిటిలోని ఇంజనీరింగ్ శాఖ విభాగంలో జూనియర్ అసిస్టెంట్ కేంద్రంగా ఈ అవినితి వ్యవహరం కొనసాగింది. మున్సిపాలిటి జనరల్ ఫండ్ రూ.2 కొట్ల నిధులలో సుమారు 54 లక్షల రూపాయలు గోల్‌మాల్ జరగడం ప్రకంపనలకు దారితీస్తుంది. జేఏఓ కిరణ్ మున్సిపాలిటి అవినితిపై రాష్ట్ర, జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయడంతో అధికారుల బాగోతం బహిర్గతమైంది.
గత రెండు నెలల క్రితం వరకు వైరా మున్సిపాలిటి కమిషనర్‌గా పని చేసిన చింతా వేణు, అకౌంటెట్‌గా పని చేసిన జూనియర్ అసిస్టెంట్ వెంకటేశ్వర్లు ఈ అవినితికి పాల్పడుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. మున్సిపాలిటిలోని జనరల్ ఫండ్ సుమారు 54 లక్షల రూపాయలు ఈ ఇద్దరు ఉద్యోగులు బ్యాంకుల నుంచి తమ ఇష్టారాజ్యంగా డ్రా చేశారు. తమ నిధులకు నిరంతరం డుమ్మా కొట్టే ఇంజనిరింగ్ విభాగం జూనియర్ అసిస్టెంట్, అకౌంటెంట్ సెల్ప్ చెక్కులు రాసుకొని 54 లక్షల రూపాయలు దుర్వినియోగం చేశారు.ఈ చెక్కులపై అప్పటి మున్సిపాలిటి కమీషనర్ చింతా వేణు సంతకాలు చేశారు. నిభందనల ప్రకారం ఏదైనా పని జరిగితే ఆ పనికి సంబందించిన ఏజెన్సి పేరుతో చెక్కును మంజూరు చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా ఇస్టానుసారంగా వెంకటేశ్వర్లు తన పేరుపై చెక్కులు రాసుకొని నిధుల కాజేశారు.
ఈ వ్యవహరం అంతా అప్పటి మున్సిపల్ కమీషనర్ చింతా వేణు కనుసన్నల్లో కొనసాగిందని, చిన్న చిన్న పనులను చూపిస్తూ ఆ నిధులను ఖ్చు చేసినట్లు రికార్డుల్లో చూపించటం విశేషం. జేఏఓ కిరణ్ ఫిర్యాదుతో ఆర్డిఏంఏ షాహిద్ మంగళవారం విచారణ చేపట్టారు.కిరణ్ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి రెండు నెలలు గడుస్తున్న అకౌంటెంట్ వెంకటేశ్వర్లు పూర్తిస్ధాయిలో బాధ్యతలు అప్పజేప్పలేదు.దీంతో అనుమానం వచ్చిన జేఏఒ కిరణ్ ఖాతాలను పరిశీలించగా ఈ అవినితి అంతా భయటపడటంతో ఉన్నతాదికారులకు కిరణ్ ఫిర్యాదు చేశాడు.
మున్సిపాలిటి ఏర్పడినప్పటి నుండి ట్రేడ్ లైసెన్స్ పన్నును ముక్కపిండి వసూలు చేస్తున్నారని ఆ డబ్బును జమ చేయకుండా ఆధికారులు వారి జేబులోనే వేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఈ ఆవినితిపై జిల్లా ఉన్నతాదికారులు సిరియస్‌గా తీసుకొని చిచారణ చేపడుతారా లేదా అనేది ఇప్పుడు వైరా తీవ్ర చర్చాంశనియంగా మారింది.అయితే వైరాలో ప్రతిసారి అనినితి జరగటం,అదికారులు విచారణ నిర్వహించి వదిలేయటం పరిపాటిగా మారింది.ఇప్పటికైనా సిడిఎంఏ అధికారులు స్పందించి వైరా మున్సిపాలిటిలో జరిగిన అవినితిపై తగు చర్యలు తీసుకొవాలని మున్సిపాలిటి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.