జైపూర్: రాజస్థాన్ లో ఘోర బస్సులో అగ్నిప్రమాదం జరిగింది. బస్సులో మంటలు వ్యాపించడంతో 20 మంది మృతి చెందారు. జైసల్మేర్-జోధ్‌పూర్ ఆకస్మికంగా మంటలు చెలరేగి బస్సు అంతటా వ్యాపించడంతో ప్రయాణికులకు తప్పించుకునే అవకాశమే లేకుండా పోయింది. జాతీయ రహదారిపై థయ్యాత్ గ్రామం వద్ద ఈ దుర్ఘటన జరిగింది. బస్సులో మొత్తం 57 మంది ప్రయాణికులు ఉండగా వారిలో 16 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. షార్ట్ సర్క్యూటే ఇందుకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.