బడ్డీ కామెడీగా ఆద్యంతం నవ్వించేలా బీవీ వర్క్ బ్యానర్ మీద బన్నీ వాస్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్ మీద కళ్యాణ్ మంతెన, భాను ప్రతాప, డా.విజేందర్‌రెడ్డి తీగల నిర్మించిన చిత్రం ‘మిత్ర మండలి’. ఈ మూవీలో ప్రియదర్శి, నిహారిక ఎన్‌ఎం హీరో హీరోయిన్లుగా నటించా రు. ఈ సినిమాకు విజయేందర్ దర్శకత్వం వహించారు. బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, సత్య, విష్ణు ఓయి, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా, విటివి గణేష్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని అక్టోబర్ 16న విడుదల చేస్తున్నారు. ఇక హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ హీరో శ్రీ విష్ణు ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ.. “మిత్ర మండలి’ పెద్ద హిట్ అవుతుంది.
ఈ మూవీని మైండ్‌తో కాకుండా, మనసుతో చూడండి. అందరినీ నవ్విస్తుంది” అని అన్నారు. ప్రియదర్శి మాట్లాడుతూ “మిత్ర మండలితో దీపావళిని మేం మీ కోసం ముందుగానే తీసుకువస్తున్నాం. అక్టోబర్ 16న ఫ్రెండ్స్, ఫ్యామిలీతో వెళ్లి మా చిత్రా న్ని చూడండి” అని తెలిపారు. బన్నీ వాస్ మాట్లాడుతూ దీపావళికి ఫ్యామిలీని నవ్వించే క్లీన్ ఎంటర్‌టైనర్ ఇదని పేర్కొన్నారు. డైరెక్టర్ విజయేందర్ మాట్లాడుతూ “మిత్ర మం డలి సినిమా చాలా బాగా వచ్చింది. అందరూ చూసి సక్సెస్ చేయండి” అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నిహారిక ఎన్‌ఎం, భాను ప్రతాప, డా.వి జేందర్‌రెడ్డి తీగల, ధృవన్, అనుదీప్ కేవీ, కళ్యాణ్ శంకర్, వివేక్ ఆత్రేయ, ఆదిత్య హాసన్ పాల్గొన్నారు.