సక్సెస్‌ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా కె ర్యాంప్. ఈ సినిమాను హా స్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్‌ల మీద రాజేశ్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు జైన్స్ నాని దర్శక త్వం వహిస్తున్నారు. ఈ మూవీ దీపావళి పండుగ సందర్భంగా ఈ నెల 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతోంది.
ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ రాజేశ్ దండ మాట్లాడుతూ ..“దర్శకుడు జైన్స్ నాని చెప్పిన కథ నాకు నచ్చింది. ఇందులో హీరో పాత్ర పేరు కుమార్. ఆ క్యారెక్టరైజేషన్ ఆకట్టుకుంది. – కథానుసారమే కేరళ బ్యాక్‌డ్రాప్ ఉంది. కేరళలో షూటింగ్ చేయడం వల్ల సినిమాకు కొత్త లుక్ వచ్చింది. కథలో హీరోయిన్ కేరళ అమ్మాయి. అక్కడ కాలేజ్ లో చేసిన సీన్స్, ఓనమ్ సాంగ్ విజువల్‌గా కలర్‌ఫుల్‌గా వచ్చాయి. -సినిమా చిత్రీకరణ సమయంలో కిరణ్ ఎంతో సహకరించారు”అని అన్నారు. ప్రొడ్యూసర్ శివ బొమ్మకు మాట్లాడుతూ.. “కుమార్ పాత్రలో హీరో కిరణ్ అబ్బవరం ఎనర్జిటిక్‌గా నటించారు. హీరోయిన్ క్యారెక్టర్ సర్‌ప్రైజ్ చేస్తుంది. నరేష్, వెన్నెల కిషోర్ పాత్రలను ప్రేక్షకులు గుర్తుపెట్టుకుంటారు”అని పేర్కొన్నారు.