మన తెలంగాణ/హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమలో తొలి నేపథ్య గాయని రావు బాలసరస్వతి(97) కన్నుమూశా రు. ఆమె అనారోగ్యంతో హైదరాబాద్ మ ణికొండలోని స్వగృహంలో బుధవారం ఉదయం 8గంటలకు తుదిశ్వాస విడిచా రు. 1928 ఆగస్ట్ 29న జన్మించిన రావు బాలసరస్వతి తన ఆరేళ్ల వయసు నుంచే పాడటం ప్రారంభించారు. ఆమె గొంతు ఆకాశవాణి సంగీత కార్యక్రమాలతో తెలు గు వారందరికీ సుపరిచితం. ఇక ‘సతీ అనసూయ’ చిత్రంలో ఆమె తొలి పాట పాడారు. సినిమాలలో తొలి నేపథ్య గా యనిగానూ ఆమె ఎంతో పేరుగాంచారు. స్వప్నసుందరి, పిచ్చిపుల్లయ్య, పెళ్ళిసందడి, శాంతి, షావుకారు, దేవదాసు, లైలా మజ్ను, భాగ్యలక్ష్మి, మంచి మనసుకు మంచి రోజులు తదితర చిత్రాల్లో ఘంటసాల, ఏ.ఎం.రాజా, సౌందర్‌రాజన్, పి ఠాపురం నాగేశ్వరరావు, జిక్కి, ఏ.పి. కో మల లాంటి వారితో కలిసి ఆమె పాటలు పాడి సుమధుర గాయనిగా పేరు తెచ్చుకున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, హిం దీతో పాటు పలు భాషల్లో 2000కు పైగా పాటలు పాడారు రావు బాలసరస్వతి. రా వు బాల సరస్వతి అసలు పేరు సరస్వతి. తల్లి తండ్రుల పేర్లు విశాలాక్షి, కావేటి పార్థసారధి.
మంచి గాయకులైన ఆమె తండ్రి వీణ, సితారు వాయించేవారు. ఇక ఆలకూరు సుబ్బయ్య వద్ద బాల సరస్వతి 1939లో కర్ణాటక సంగీతం మూడు సంవత్సరాలు అభ్యసించారు. ఆపైన బాల సరస్వతిని ఆమె తండ్రి ముంబై తీసుకెళ్ళి, హిందుస్తానీ సంగీత ప్రముఖులైన ఖేల్కర్, సినీ సంగీత దర్శకులు వసంత్ దేశాయ్ వద్ద అభ్యాసం చేయించారు. ఇక సి.పుల్లయ్య దర్శకత్వం వహించిన ’సతీ అనసూయ’లో రావు బాలసరస్వతి గంగ వేషం వేశారు. ఆ యూనిట్‌లో ఆమె చిన్నపిల్ల. చిన్నప్పుడు ఆమెను బేబీ సరస్వతి అని పిలిచేవారు. ఆ తర్వాత బాల సరస్వతి అనడం మొదలు పెట్టారు. అదే చివరకు ఆమె పేరు అయిపోయింది. బాల సరస్వతి సుమారు 12 సినిమాలలో బాల నటిగా కనిపించారు. అయితే తల్లిదండ్రులకు ఇష్టం లేకపోవడంతో పాటు నటనపై ఆసక్తి లేకపోవడంతో ఆతర్వాత రావు బాలసరస్వతి నటించడం మానేశారు. 1943లో ప్లే బ్యాక్ కొత్తగా వచ్చింది. దానికి ముందు ఎవరి పాటలు వారే పాడుకునే వారు. ఆ సమయంలో భాగ్యలక్ష్మీ సినిమాకు మొట్టమొదటగా ప్లే బ్యాక్ పాడారు బాల సరస్వతి. పెద్దాయక ఆమె తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషా చిత్రాలలో పాటలు పాడారు. ముఖ్యంగా శ్రీశ్రీ, ఆరుద్ర, కొసరాజు, కృష్ణశాస్త్రి రాసిన పాటలను ఆమె ఎక్కువగా పాడారు. 1974లో విజయనిర్మల దర్శకత్వం వహించిన ’సంఘం చెక్కిన శిల్పాలు’ చిత్రంలో ఆమె పాట పాడారు. అదేవిధంగా సి. నారాయణరెడ్డి రాసిన మీరా భజలనూ గానం చేశారు.
వివాహం అనంతరం అవకాశాలు వదులుకొని…
బాల సరస్వతి కోలంక జమీందారీకి చెందిన రాజారావు ప్రద్యుమ్న కృష్ణ మహీపతి సూర్యారావును 1944లో వివాహమాడారు. అనంతరం జమీందారీ కట్టుబాట్ల వల్ల రాను రాను సినీ నేపథ్య గాయనిగా ఎన్నో అవకాశాలు వచ్చినా వదులుకోవాల్సి వచ్చింది. అయితే ఆమె ఆకాశవాణి మద్రాసు కేంద్రంలో ఎన్నో లలిత గీతాలు ఆలపించారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో ఎన్నో పాటలు పాడారు.
ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు…
రావు బాలసరస్వతికి ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు వచ్చాయి. రామినేని ఫౌండేషన్, అజో – విభో కందాళం ఫౌండేషన్, పాలగుమ్మి విశ్వనాథం స్మారక పురస్కారంతో పాలు పలు అవార్డులు ఆమెకు లభించాయి.
రావు బాలసరస్వతి మృతిపై సిఎం సంతాపం
తెలుగు చలనచిత్ర రంగం తొలి నేపథ్య గాయని రావు బాలసరస్వతి మృతి పట్ల సిఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. దక్షిణాదిలో తొలి నేపథ్య గాయనిగా, తెలుగు సినిమా రంగానికి లలిత సంగీతాన్ని పరిచయం చేసిన బాలసరస్వతి దేవి మరణం చలనచిత్ర రంగానికి తీరని లోటని ఆయన పేర్కొన్నారు. శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు సిఎం రేవంత్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కాగా, తెలుగు సినిమా స్వర్ణయుగానికి తన మధురగానంతో పునాది వేసిన తొలితరం నేపథ్య గాయని, నటి రావు బాలసరస్వతీ దేవి (97) వయోభారం, అనారోగ్య సమస్యలతో బుధవారం కన్నుమూశారు. లలిత సంగీత సామ్రాజ్ఞిగా తెలుగు ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న ఆమె మృతితో సినీ లోకం శోకసంద్రంలో మునిగిపోయింది. రావు బాలసరస్వతీ దేవి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, మంత్రులు దిగ్భాంతి వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని సంతాపం తెలిపారు.
పవన్‌కళ్యాణ్, బాలకృష్ణ సంతాపం…
రావు బాలసరస్వతి మృతి పట్ల స్టార్ హీరో పవన్‌కళ్యాణ్ సంతాపం వ్యక్తం చేశారు. “సరస్వతి కన్నుమూశారని తెలిసి చింతించా. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. ఆమె కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా”అని పవన్ అన్నారు. ఇక రావు బాలసరస్వతి మృతి కలచివేసిందని బాలకృష్ణ తెలిపారు. తెలుగు, తమిళ చిత్రాల్లో నటి, గాయనిగా ఆమె మంచి పేరు తెచ్చుకున్నారని పేర్కొన్నారు.