మిరాయ్ లాంటి పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ తర్వాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వస్తున్న మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ’తెలుసు కదా’. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా హీరోయిన్స్. ప్రముఖ స్టైలిస్ట్-ఫిల్మ్ మేకర్ నీరజా కోన దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. తెలుసు కదా అక్టోబర్ 17న గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఈ సందర్భంగా స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “-ఇందులో నా క్యారెక్టర్ చాలా బలంగా ఉండబోతుంది. కచ్చితంగా ఆడియన్స్‌ని షాక్ చేస్తుందని నమ్ముతున్నాను. ఇందులో మంచి హాస్యం కూడా ఉంటుంది. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత సినిమా మీద అంచనాలు మరింతగా పెరిగాయి. ఇందులో నేను చేసిన వరుణ్ క్యారెక్టర్ అందరినీ అలరిస్తుంది. ఖచ్చితంగా ఆడియన్స్‌కి ఈ క్యారెక్టర్ చాలా కొత్త అనుభూతినిస్తుందన్న నమ్మకం ఉంది. సినిమాలో 80 శాతం కొత్త సీన్స్ ఉంటాయి. లవ్ స్టోరీ, లవ్ మ్యారేజ్, కుటుంబ అనుబంధాల గురించి చర్చ ఉంటుంది. రాశీ, శ్రీనిధి క్యారెక్టర్స్ బలంగా ఉంటాయి. వాళ్ళకి మించిన బలమైన పాత్ర హీరోది. చాలా కొత్త సినిమా ఇది. -సినిమాలో ప్రేమ, జీవితం గురించి డైలాగ్స్ చాలా హార్డ్ హిట్టింగ్‌గా ఉంటాయి. -విశ్వప్రసాద్, కృతితో కలిసి పనిచేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. తమన్ అందించిన రెండు సాంగ్స్ బ్లాక్‌బస్టర్స్ అయ్యాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది” అని అన్నారు.