మన తెలంగాణ/హైదరాబాద్: ఎట్టకేలకు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి బి జెపి అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి పేరును ఆ పార్టీ జాతీయ నాయకత్వం బుధవారం ప్రకటించింది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బిఆర్‌ఎస్ పార్టీలు ఇదివరకే తమ అభ్యర్థులను బరిలోకి దించి విస్తృతంగ ప్రచారం నిర్వహిస్తుండగా బిజెపి అభ్యర్థి ఎంపిక విషయంలో జాప్యం చేసింది. చివరకు లంకల దీపక్ రెడ్డి అభ్యర్థిత్వా న్ని ఖరారు చేసింది. దీపక్ రెడ్డి గత అసెంబ్లీ సా ర్వత్రిక ఎన్నికల్లోనూ పోటీ చేశారు. ఆయన ప్ర స్తుతం బిజెపి హైదరాబాద్ సెంట్రల్ అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. బిఆర్‌ఎస్ తరపున ఎన్నికైన మగంటి గోపినాథ్ ఈ ఏడాది జూన్ 8న అనారోగ్యంతో కన్నుమూశారు. దీంతో ఉపఎన్నిక అనివార్యమైంది. పోలింగ్ వచ్చే నెల 11న, ఓట్ల లెక్కింపు 14న జరగనున్నది.