మావోయిస్టులు అస్త్రాలు వదిలి లొంగిపోవాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు. గడ్చిరోలి ప్రాంతంలో వారి ఉనికికి గట్టి దెబ్బగా మావోయిస్టుల సీనియర్ నాయకుడు మల్లోజుల వేణుగోపాల్ రావు అరవై మంది దళ సభ్యులతో కలిసి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో లొంగిపోయారని ఆయన తెలిపారు. ఈ పరిణామం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా దృఢమైన, ఫలితాలపై దృష్టి పెట్టిన కాలపరిమితికి ప్రతిబింబం అని ఆయన బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి నక్సలిజం పూర్తిగా నిర్మూలించాలన్నది కేంద్ర మంత్రి అమిత్ షా లక్షమని ఆయన తెలిపారు. అంతర్గత భద్రత పట్ల ఆయన రాజీ లేని వైఖరి దృఢమైన అమలు స్పష్టమైన ఫలితాలు ఇస్తున్నాయని ఆయన పేర్కొన్నారు ప్రధాని నరేంద్ర మోడి నాయకత్వంలో ఎన్టీయే ప్రభుత్వం శాంతి-భద్రత, అభివృద్ధికి కృషి చేస్తున్నదని ఆయన తెలిపారు. ఈ సమయంలో మావోయిస్టులు లొంగిపోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ సూచించారు.
==++==