అగర్తాలా: పసికందుపై కామాంధుడు అత్యాచారం చేసి అనంతరం చంపేసి పొలంలో పాతి పెట్టాడు. ఈ సంఘటన త్రిపుర రాష్ట్రం పాణిసాగర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అస్సాం రాష్టం నిలంబజార్‌కు చెందిన జలాల్ ఉద్దిన్ అనే వ్యక్తి పాణిసాగర్‌లో కూలీగా పని చేస్తున్నాడు. ఓ మహిళ నుంచి 14 నెలల పాపను తీసుకొని బయట ఆడిస్తానని నమ్మించాడు. అనంతరం గ్రామ శివారులోకి తీసుకెళ్లి పాపపై అత్యాచారం చేసి చంపేశాడు. అనంతరం పాపను పొలంలో పాతిపెట్టిపారిపోయాడు. మూడు గంటల నుంచి పాపను జలీల్ తీసుకరాకపోవడంతో తల్లి చిన్నారి కోసం వెతకడం ప్రారంభించింది. గ్రామస్థులు అందరూ పాప కోసం వెతికారు. ఎక్కడా కనిపించకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. గ్రామ శివారులో పొలంలో పాతిపెట్టిన పాప మృతదేహం కనిపించింది. వెంటనే పోలీసులు మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు పోక్సో యాక్టు కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.