హర్యానాలో మరో పోలీసు అధికారి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఇటీవల సీనియర్ ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ ఆత్మహత్య కేసు పరిష్కారం కాక ముందే మరో అధికారి బలవన్మరణానికి పాల్పడ్డారు. సైబర్ క్రైం విభాగంలో పనిచేస్తున్న అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ (ఏఎస్‌ఐ) సందీప్ కుమార్ మృతదేహం రోహటక్ – పానిపట్ రోడ్డులోని ట్యూబ్ వెల్ సమీపంలో లభ్యమైంది. పూరన్ కుమార్ అవినీతి కేసును అతడు దర్యాప్తు చేస్తున్నారు. సందీప్ కుమార్ మృతదేహం సమీపంలోనే పోలీసులు మూడు పేజీల సూసైడ్ నోట్ ను, స్వాధీనం చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు ఆ అధికారి రికార్డు చేసిన వీడియో ను పరిశీలిస్తున్నారు. వరుసగా ఇద్దరు సీనియర్ పోలీసు అధికారుల ఆత్మహత్య పై ప్రభుత్వం సీరియస్ అయింది. ప్రతిపక్షాల వత్తిడి నేపథ్యంలో రాష్ట్ర డిజీపీ శతృఘ్న్ కపూర్ ను సెలవుపై పంపివేసింది. గతంలోనే రోహ్ తక్ ఎస్పీ నరేంద్ర బిజర్నియా ను బదిలీ చేశారు.
సందీప్ కుమార్ తన నోట్ లో అక్టోబర్ 7న ఆత్మహత్య చేసుకున్న ఐపీఎస్ అధికారి వై పూరన్ కుమార్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. పూరన్ కుమార్ ఒక అవినీతి అధికారి అని, ఆయనకు సంబంధించి చాలా ఆధారాలు, రుజువులు ఉన్నాయన్నారు. కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగా తనను అరెస్ట్ చేస్తారని భయపడుతున్నానని ఏఎస్ ఐ పేర్కొన్నాడు. చనిపోయే ముందు మొత్తం అవినీతి బాగోతాన్ని బయటపెట్టాలని అనుకుంటున్నట్లు ఆ నోట్ లో పేర్కొన్నారు. తన మరణం తర్వాత నైనా ఈ కేసులో నిష్పాక్షిక దర్యాప్తు జరగాలని తాను కోరుతున్నట్లు సందీప్ కుమార్ పేర్కొన్నారు. పూరన్ కుమార్ అవినీతి కుటుంబాన్ని వదిలి పెట్టకూడదని, అతడు తన స్వార్థం కోసం కులరాజకీయాలను వాడుకొని, వ్యవస్థనే హైజాక్ చేశాడని నోట్ లో ఆరోపించారు.
ఆ వీడియోలో పూరన్ కుమార్ కుల రాజకీయాలు, అవినీతి తో పోలీసు శాఖనే తీవ్రంగా ప్రభావితం చేశాడని ఆరోపించారు. ఐపీఎస్ అధికారి బాధ్యతలు చేపట్టిన మొదటి రోజునుంచే కులరాజకీయాలను ప్రారంభించి, తన వారిని కింది ఉద్యోగులుగా నియమించుకుని పైళ్ల శోధన చేపట్టాడని సందీప్ పేర్కొన్నాడు. తర్వాత సంబంధిత అధికారులను పిలిపించి, హింసించి డబ్బువసూలు చేసేవాడని, మహిళా పోలీసు అధికారులను కూడా బదిలీ చేస్తామని బెదిరిస్తూ, కొందరిపై లైంగిక వేధింపులకు గురు చేశాడని ఆ వీడియోలో ఆరోపించారు.
ఐపీఎస్ అధికారి ఆత్మహత్యపై దర్యాప్తు
అక్టోబర్ 7న 52 ఏళ్ల ఐపీఎస్ అధికారి వై. పూరన్ కుమార్ చండీగఢ్ లోని సెక్టార్ 11లోని తన నివాసంలోసర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆకేసు దర్యాప్తు చేస్తున్న బృందంలోని ఏఎస్‌ఐ సందీప్ కుమార్ కూడా నేడు ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయంశం అయింది.పూరన్ కుమార్ 2001 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. రోహ్ తక్ లోని సునారియాలోని పోలీసు శిక్షణా కేంద్రంలో ఇన్ స్పెక్టర్ జనరల్ గా పనిచేస్తున్నారు. ఆయన ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఆయన భార్య ఐఏఎస్ అధికారి అమ్ నీత్ పూరన్ కుమార్ ఇంట్లో లేరు. హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ నాయకత్వంలోని ప్రతినిధివర్గంలో సభ్యురాలిగా జపాన్ లో అధికారిక పర్యటనలో ఉన్నారు.
రాష్ట్ర డిజీపీ శతృఘ్న్ కుమర్ పై వేటు
ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ ఆత్మహత్య, అదే కేసు దర్యాప్తు చేస్తున్న మరో ఏఎస్‌ఐ కూడా బలవన్మరణానికి పాల్పడడంతో హర్యానా ప్రభుత్వం సీరియస్ అయింది. ఒక పక్క ప్రతిపక్షాలు దాడి ప్రారంభించడం, మరో పక్క పూరన్ కుటుంబసభ్యులు ఆయనను వేధించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడంతో రాష్ట్ర డిజిపీ శతృఘ్న్ కుమార్ ను సెలవులో పంపివేసింది. ఇంతకు ముందే రాష్ట్ర ప్రభుత్వం రోహ్ తక్ పోలీసు సూపరింటెండెంట్ నరేంద్ర బిజర్నియాను బదిలీ చేసింది డీజీపీని రాష్ట్రప్రభుత్వం డీజీపీ ని సెలవులోకి పోవల్సిందిగా ఆదేశించినట్లు హర్యానా ముఖ్యమంత్రి మీడీయా సలహాదారు రాజీవి జైట్లీ వెల్లడించారు. పూరన్ కుమార్ తన సూసైడ్ నోట్ లో డిజీపీ శతృఘ్న్ కుమార్, నరేంద్ర బిజర్నియా లు కూడా కులవివక్షతతో , తనను మానసికంగా వేధించారని పేర్కొన్నారు.