న్యూఢిల్లీ: వెస్టిండీస్‌తో జరిగిన రెండు టెస్ట్‌ల సిరీస్‌ను భారత్ 2-0 తేడాతో వైట్‌వాష్ చేసింది. భారత ఆటగాళ్లు సమిష్టిగా రాణించి ఈ విజయాన్ని సొంతం చేసుకున్నారు. రెండో టెస్ట్ మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది అవార్డు కుల్దీప్‌కి దక్కగా.. సిరీస్‌లో ఓ సెంచరీతో పాటు ఎనిమిది వికెట్లు తీసిన రవీంద్ర జడేజాకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లభించింది. అయితే ఈ విజయంతో ఓ ప్రపంచ రికార్డును సాధించింది. ఒకే జట్టుపై వరుసగా ఎక్కువ సిరీస్ విజయాలు సాధించిన జట్టుగా ప్రపంచ రికార్డును సమం చేసింది.
ఈ రికార్డు సౌతాఫ్రికా పేరిట ఉంది. సౌతాఫ్రికా 1998-24 మధ్యకాలంలో వెస్టిండీస్‌పై వరుసగా 10 టెస్ట్ సిరీస్‌లలో విజయం సాధించింది. ఇదే రికార్డును.. అదే ప్రత్యర్థిపై భారత్ సాధించింది. భారత్ 2002-25 మధ్యకాలంలో వెస్టిండీస్‌పై 10 టెస్ట్ సిరీస్‌లు కైవసం చేసుకుంది. ఈ రెండు జట్ల తర్వాతి స్థానంలో ఆస్ట్రేలియా ఉంది. ఆస్ట్రేలియా కూడా వెస్టిండీస్‌పైనే ఈ రికార్డు సాధించడం విశేషం. ఆసీస్ వకూ ఇప్పటివరకు 9 సార్లు టెస్టు సిరీస్‌లలో పై చేయి సాధించింది.