గడ్చిరోలి: ఆపరేషన్ కగార్ పేరుతో చేపట్టిన తర్వాత నుంచి మావోయిస్టుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుంది. భద్రతా బలగాలు, మావోల మధ్య జరిగే ఎధురుకాల్పుల్లో కొందరు మావోలు మృతి చెందుతుంటే.. మరికొందరు స్వచ్ఛందంగా పోలీసుల ఎదుట లొంగిపోతున్నారు. తాజాగా మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ రావు పోలీసులకు లొంగిపోయారు. 60 మందితో కలిసి మల్లోజుల గడ్చిరోలి పోలీస్‌ల ఎదుట లొంగిపోయినట్లు ఛత్తీస్గడ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ వెల్లడించారు. ఈ సందర్భంగా విజయ్ శర్మ మాట్లాడుతూ.. ‘‘మావోయిస్టు నేతలు జనజీవన స్రవంతిలో కలవడాన్ని హర్షిస్తున్నాం. నక్సలిజం అంతం కావాలని బస్తర్ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు’’ అని అన్నారు. లొంగిపోయిన మావోయిస్టులకు ఉపాధి కల్పిస్తామని విజయ్ శర్మ హామీ ఇచ్చారు. 1970లో మల్లోజుల అలియాస్ సోను అలియాస్ భూపతి మావోయిస్టు పార్టీలో చేరారు. మావోయిస్టు అగ్రనేత కోటేశ్వర రావు అలియాస్ కిషన్‌జీకి ఆయన సోదరుడు.