జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాగంటి సునీత గోపీనాథ్‌కు పార్టీ అధినేత కెసిఆర్ మంగళవారం బి.ఫామ్ అందజేశారు. ఎన్నికల ఖర్చు నిమిత్తం పార్టీ తరఫున రూ.40 లక్షల చెక్కును అందించారు. కార్యక్రమంలో మాగంటి గోపీనాథ్ కుమార్తెలు, కుమారుడు, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, పద్మారావు గౌడ్, ఎంఎల్‌ఎలు కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, నలమోతు భాస్కర్ రావు, తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు.