ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన జూబ్లీహిల్స్ నియోజకవర్గ బిఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, ఆమె కూతురిపై కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేయడంతో జూబ్లీహిల్స్ పోలీసులు ఎంసిసి కేసు నమోదు చేశారు. మాగంటి సునీత ఆమె కూతురు మాంగటి అక్షర యూసుఫ్‌గూడ, వెంకటగిరి ఏరియాలో శుక్రవారం ప్రార్థనల తర్వాత మజీద్ ప్రాంతానికి వెళ్లి ప్రచారం చేశారు. ఈ విషయం తెలియడంతో కాంగ్రెస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సునీత, అక్షర, యూసుఫ్‌గూడ కార్పొరేటర్ రాజ్‌కుమార్ పటేల్, మరో నలుగురిపై కేసు నమోదు చేశారు.