పాట్నా: బిహార్ అసెంబ్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆ రాష్ట్రంలో పార్టీలు ప్రచారాన్ని వేగవంతం చేస్తున్నాయి. ప్రజలను ఆకట్టుకునేందుకు రకరకాల వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక ఇటీవలే బిహార్‌లో ఎన్‌డిఎ పార్టీల సీట్ల పంపిణీ ఒప్పందం జరిగింది. అందులో బిజెపికి 101 స్థానాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా బిజెపి అభ్యర్థులకు సంబంధించి తొలి జాబితాను విడుదల చేసింది. మొత్తం 71 స్థానాల అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఇందులో ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌధరీ తారాపూర్ నుంచి పోటీ చేయనున్నారు. మరో డిప్యూటీ సిఎం విజయ్ కుమార్ సిన్హా లఖిసరాయ్ నుంచి బరిలోకి దిగనున్నారు. మంత్రులు నితన్ నబీన్.. బాంకీపూర్, రేణు దేవీ.. బేతియా, మంగల్ పాండే సీవాన్ నుంచి పోటీ చేయనున్నారు. ఈ ఎన్నికల్లో బిజెపి మొత్తం 101 స్థానాల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.