ఢిల్లీ: అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్-వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ ఐదో రోజు టీమిండియా 33 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 108 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. గెలుపుకు 13 పరుగుల దూరంలో టీమిండియా ఉంది. గిల్ 13 పరుగులు చేసి రోస్టన్ చేస్ బౌలింగ్‌లో జస్టీన్ గ్రీవస్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. సాయి సుదర్శన్ 39 పరుగులు చేసి రోస్టన్ చేజ్ బౌలింగ్‌లో షాయ్ హోప్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. యశస్వి జైస్వాల్ ఎనిమిది పరుగులు చేసి వర్రికన్ బౌలింగ్‌లో అండర్సన్ ఫిలిప్‌కు క్యాచ్ మైదానం వీడాడు. ప్రస్తుతం క్రీజులో కెఎల్ రాహుల్(48), ధృవ్ జురెల్(0) పరుగులతో ఆటను కొనసాగిస్తున్నారు.
ఇండియా తొలి ఇన్నింగ్స్: 518/5
వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్: 248
వెస్టిండీస్ సెకండ్ ఇన్నింగ్స్: 390