నీలం స్టూడియోస్, అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణంలో ప్రముఖ దర్శకుడు పా రంజిత్ సమర్పణలో మారి సెల్వరాజ్ దర్శకుడుగా ధృవ్ విక్రమ్ హీరోగా నటిస్తున్న చిత్రం బైసన్. ఈ చిత్రాన్ని అక్టోబర్ 24న జగదంబే ఫిలిమ్స్ ప్రొడ్యూసర్ బాలాజీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు.
తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను హీరో దగ్గుబాటి రానా రిలీజ్ చేసి టీమ్‌కు శుభాకాంక్షలు చెప్పారు. 1990 బ్యాక్‌డ్రాప్ పీరియాడిక్ నేపథ్యంలో కబడ్డీ ఆట కథాంశంతో వచ్చిన ఈ ట్రైలర్ రా అండ్ రస్టిక్‌గా ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. ఈ సందర్భంగా నిర్మాత బాలాజీ మాట్లాడుతూ..“ఈ చిత్ర ట్రైలర్ ఆసక్తికరంగా ఉంటూనే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో అందర్నీ ఆకట్టుకుంటోంది. ధృవ్ తనదైన నటనతో ఆకట్టుకున్నారు”అని అన్నారు.