న్యూఢిల్లీ: అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో వెస్టిండీస్ ఆలౌట్ అయింది. 311 పరుగుల వద్దే 9 వికెట్లు కోల్పోయిన వెస్టిండీస్‌కి గ్రీవ్స్, సీల్స్‌ల జోడీ అండగా నిలిచింది. వీరిద్దరు కలిసి చివరి వికెట్‌కి 79 పరుగులు జోడించారు. ఈ క్రమంలో గ్రీవ్స్(50) అర్థశతకం కూడా సాధించాడు. అయితే బుమ్రా బౌలింగ్‌లో సీల్స్ (32) సుందర్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ కావడంతో వెస్టిండీస్ ఇన్నింగ్స్ ముగిసింది. భారత్ విజయానికి 121 పరుగుల లక్ష్యాన్ని ముందుంచారు. అయితే లక్ష్య చేధనలో భారత్ ఆరంభంలోనే తొలి వికెట్‌ను కోల్పోయింది. వారికన్ బౌలింగ్‌లో యశస్వీ జైస్వాల్(8) క్యాచ్ ఔట్ అయ్యాడు. దీంతో 2 ఓవర్లు ముగిసే సరికి భారత్ 1 వికెట్ నష్టానికి 9 పరుగులు చేసింది. క్రీజ్‌లో రాహుల్ (1), సుదర్శన్ (0) ఉన్నారు. భారత్ విజయానికి ఇంకా 112 పరుగులు చేయాల్సి ఉంది.