ఢిల్లీ: బిసి రిజర్వేషన్లు, హైకోర్టు స్టే గురించి ఎఐసిసి మల్లిఖార్జున ఖర్గేకు వివరించామని టిపిసిసి మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. సుప్రీం కోర్టుకు వెళ్తున్నామనే విషయం కూడా చెప్పామని అన్నారు. ఢిల్లీ లో ఖర్గేను మహేశ్ కుమార్ గౌడ్ పరామర్శించారు. ఖర్గే ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వీలైనంత త్వరగా సుప్రీంకోర్టులో ప్రభుత్వం అప్పీల్ చేస్తుందని, కాంగ్రెస్ నేతలు కూడా సుప్రీం కోర్టులో పిటిషన్ వేస్తారని తెలియజేశారు. మంత్రుల మధ్య వివాదాలు చిన్న చిన్న అంశాలని, సమాచార లోపం వల్లే మంత్రుల మధ్య వివాదాలని మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.