సంగారెడ్డి: పోలియో చుక్కలు వేసిన కాసేపటికే పసి బాలుడు మృతి చెందాడని తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం భీమ్రాలో జరిగింది. పల్స్ పోలియో చుక్కలు వేసిన కాసేపటికే 3 నెలల కుమారుడు మృతి చెందినట్లు తల్లిదండ్రులు కంటతడి పెట్టారు. పోలియో చుక్కలు వేశాక ఇంటికి వచ్చామని, బాలుడు వాంతులు చేసుకున్నాడని వివరించారు. పాలు తాగకుండా ఏడుస్తూనే ఉండడంతో వైద్య సిబ్బందిని నిలదీశామని, అందరికి వేసిన చుక్కలే ఈ బాలుడికి వేశామని తెలిపారు. చిన్నారి ఇతర అనారోగ్య సమస్యలు ఉండి ఉంటాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మూడు నెలల బాబు శవ పరీక్ష నిర్వహిస్తే అన్ని నిజాలు బయటకు వస్తాయని నెటిజన్లు సూచిస్తున్నారు. పోలీయో చుక్కలతో చనిపోవడం అనేది జరగదని వైద్య నిపుణులు చెబుతున్నారు.