సామాజిక జీవనానికి దర్పణం లాంటిది సాహిత్యం. కొన్ని రచనలు కాలాతీతంగా నిలిచిపోతుంటాయి. అవి, ఆయా భాషా సాహిత్యాలను పరిపుష్టం చేస్తాయి. అలాంటి రచయితలను, పాఠకుల ను ఒకే వేదికపైకి చేర్చుతూ ప్రపంచవ్యాప్తంగా యేటా సాహిత్యోత్సవాలు ఎన్నో జరుగుతుంటాయి. ప్రతియేటా బెంగుళూరులో నిర్వహించే బుక్ బ్రహ్మ లిటరేచర్ ఫెస్టివల్ భారతదేశంలోని దక్షణాది సాహిత్యంపై సృజనాత్మక సంభాషణలకు వేదికగా నిలుస్తోంది. అలాంటి సాహిత్య వేడుక తెలుగు సాహిత్యంలో లేకపోవడం ఒక వెలితి. సాహిత్యం విరివిగా వస్తు న్నా, అది చేరాల్సిన పాఠకులకి చేరడం లేదు. చేరినా రచయిత, పాఠకులు అభిప్రాయాలు పంచుకునే అవకాశాలు లేవు.
ఫలితంగా వైవిధ్యమైన సాహిత్యం ఇరుకైన దారు ల గుండానే పయనిస్తోంది. సాహిత్య వ్యాప్తిని విశాలం చేయడంలోని వెలితిని భర్తీ చేసే లక్ష్యం తో తెలుగు సాహిత్యం కేంద్రంగా ఓ సాహితీ ఉత్సవాన్ని నిర్వహించాలని సంకల్పించింది ఛాయా రిసోర్స్ సెంటర్. అలా రూపుదిద్దుకుందే ఛాయ లిటరేచర్ ఫెస్టివల్.
రచయితలు, కవులు, అనువాదకులు, ప్రచురణ కర్తలు, సినీ అభిమానులు, సాహిత్య ప్రియులను ఒకే వేదికపైకి చేర్చుతుంది సీఎల్‌ఎఫ్2025. వారి మధ్య అర్థవంతమైన చర్చలు, సంవాదాల ద్వారా సామాజిక, సాంస్కృతిక అంశాలపై ఆలోచనల వినిమయానికి ఈ సాహిత్యోత్సవం వేదికగా నిలవనుంది. తెలుగులో ఇలాంటి సాహితీ వేడుక ఒక రకంగా ఇదే మొదటిదని చెప్పాలి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి రచయిత, ప్రతి పాఠకుడిని ఇందులో భాగస్వామ్యం చేసే దిశగా ఈ సాహిత్యోత్సవ ప్రయాణం ఉంటుంది.
అక్టోబర్ 25న హైదరాబాద్‌లోని డా.బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో, ఉదయం 10గంటల నుంచి రాత్రి 8గంటల వరకు జరిగే ఈ సాహిత్యోత్సవానికి సీనియర్ జర్నలిస్ట్, పత్రి కా సంపాదకుడు కె.శ్రీనివాస్ ఫెస్టివల్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తారు. కవి యాకూబ్, ప్రముఖ రచయి త్రి కుప్పిలి పద్మ, ప్రొఫెస ర్ స్వరూపరాణి మార్గదర్శకులుగా వ్యవహరిస్తున్నారు.
ఇక నుండి ప్రతి సంవత్స రం అక్టోబర్ 4వ శనివా రం ఛాయ లిటరేచర్ ఫెస్టివల్ నిర్వహించనున్నాం. వచ్చే మూడు సంవత్సరాల పాటు ఛాయ సాహిత్యోత్సవం అంబేద్కర్ యూనివర్సిటీలోనే జరుగనుంది.
మొత్తం 16 సెషన్స్‌లో 50మంది వక్తలు పాల్గొంటారు. ఒక్కో సెషన్ 50 నిమిషాల పాటు కొనసాగుతుంది. ప్రతి సెషన్‌లో ముగ్గురు వక్తలు ఉంటారు. తెలుగు సాహిత్యం కేంద్రంగా నిర్వహిస్తున్న ఈ ఫెస్టివల్‌లో తెలుగు, ఇంగ్లీష్‌తో పాటు దక్షణాది భాషలైన దక్కనీ (ఉర్దూ), తమిళ, కన్నడ, మలయాళ సాహితీ ప్రముఖులు ఈ ఫెస్టివల్‌లో పాల్గొంటారు. తద్వారా ఇతర భాషల్లో వస్తున్న సాహిత్యం, వాటిలోని వైవిద్యాన్ని అర్థం చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది.
ఈ సాహిత్యోత్సవంలో నాలుగు సమాంతర వేదిక ల్లో రోజంతా సమావేశాలు జరుగుతాయి. లోగి లి, ముంగిలి, కితాబ్, ముచ్చట పేరుతో కేటాయించిన సమావేశ మందిరాల్లో చర్చాగోష్టులు, పుస్తకావిష్కరణలు, రచయితలతో సంభాషణలు ఉంటాయి.
దిసౌత్ స్పీక్స్: డైలాగ్స్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ స్టోరీ టెల్లింగ్ థీమ్‌తో నిర్వహిస్తున్న ప్రారంభ సమావేశంలో ఫెస్టివల్ డైరెక్టర్ కె.శ్రీనివాస్‌తో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సాహి తీ ప్రముఖులు అల్లం రాజయ్య, పెరుమాళ్ ము రుగన్, వసుధేంద్ర, షీలాటోమీ పాల్గొంటారు.
తెలుగు సాహిత్యంలో కొత్త కాపు అంశంపై నిర్వహించే సమావేశంలో యువ రచయితలు తమ అనుభవాలను పంచుకుంటారు.
తమ రచనలకు స్ఫూర్తినిచ్చిన సామాజిక పరిస్థితులను, వాటిని సాహిత్యంలోకి తర్జుమా చేయడం గురించి చర్చిస్తారు. నరేష్ కుమార్ సూఫీ మోడరేటర్‌గా వ్యవహరించే ఈ సెషన్‌లో యువ రచయితలు స్ఫూర్తికందివనం, మొహమ్మద్ గౌస్, బాలసుధాకర్ మౌళి పాల్గొంటారు.
సామాజిక అంశాలను ప్రతిబింబించడంలో దక్షిణాది సాహిత్య పాత్ర గురించి ప్రముఖ రచయిత లు పెరుమాళ్ మురుగన్ (తమిళ రచయిత), మధురాంతకం నరేంద్ర, వసుధేంద్ర (కన్నడ రచయిత) మాట్లాడుతారు. ఈ సెషన్‌కు ప్రముఖ అనువాదకులు అవినేని భాస్కర్ మోడరేటర్‌గా వ్యవహరిస్తారు.
సంగిశెట్టి శ్రీనివాస్ మోడరేటర్‌గా వ్యవహరించే ‘తెలంగాణ అస్తిత్వం -సాహిత్య ప్రయాణం’ సెషన్ లో అల్లం రాజయ్య, షాజహానా, ప్రొఫెసర్ సి. కాశీం మాట్లాడుతారు. సాహిత్యం, -సినిమా, జమిలి, ప్రయాణం అంశంపై సినీ ప్రముఖులు మాట్లాడుతారు.
మఖ్దూం మొహియుద్దీన్, సురవరం ప్రతాపరెడ్డి, గుఱ్ఱం జాషువా, తాడి నాగమ్మ రచనలపై ఒక ప్రత్యేక సెషన్ నిర్వహిస్తున్నాం. దక్షణాది భాషాహిత్యాల్లో ప్రధానమైన ఉర్దూ సాహిత్యంపై రెండు సెషన్స్ నిర్వహిస్తున్నాం. ఈ సెషన్స్‌లో ఉర్దూ, తెలుగు సాహిత్యాల మధ్య సంబంధాలపై వక్తలు చర్చిస్తారు.
వీటితో పాటు బాలసాహిత్యం, డిజిటల్ యుగం లో సాహిత్యం, ప్రచురణ, పంపిణీ లాంటి అంశాలపై ప్రత్యేక సెషన్స్ ఉంటాయి.
ఛాయ లిటరేచర్ ఫెస్టివల్, పాఠకులు తమ అభిమాన రచయితలను నేరుగా కలవడంతో పాటు, వారి రచనల గురించి మాట్లాడే అవకాశం కల్పిస్తోంది. రచయితలు తమ రచనల వెనుక ఉన్న ఉద్దేశాలు, ఆలోచనల గురించి పాఠకులతో పం చుకుంటారు. పాఠకులు రచయితలను నేరుగా కలిసి తమ పుస్తకాలపై సంతకాలు తీసుకునే అవకాశం ఉంటుంది.
సీఎల్‌ఎఫ్2025 ముగింపు సమావేశంలో ప్రజా వాగ్గేయకారుడు గోరేటి వెంకన్న ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. సాహిత్యోత్సవంలో వివి ధ ప్రచురణ సంస్థలు 14 పుస్తకాలను ఆవిష్కరిస్తాయి. 10కి పైగా ప్రచురణ సంస్థలు తమ పుస్తకాలను ఇక్కడ ప్రదర్శిస్తాయి. బుక్ స్టాల్స్‌తో పాటు ఫ్లీ మార్కెట్లో వివిధ స్టాల్స్ అందుబాటులో ఉంటాయి. సృజనకారుల, సాహితీ అభిమానుల ఆలోచనలను, అనుభూతులను తిరిగి సమాజంలోకి విస్తరింపజేయడానికి, మానవ సంబంధాల ను బలోపేతం చేయడానికి, భవిష్యత్తరాలను స్ఫూర్తిమంతం చేయడానికి ఈ లిటరేచర్ ఫెస్టివల్ వేదిక అవుతుందని నమ్ముతున్నాం. సాహితీ సమాజాన్ని ఒకటి చేయడం ఈ లిటరేచర్ ఫెస్టివ ల్ లక్ష్యం. ఈ సాహితీ వేడుకలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలని కోరుతున్నాం.
– ఛాయ రిసోర్స్ సెంటర్