ఎవరు ఎవరిని అవమానిస్తున్నారో తేల్చుకుందాం
వివేక్ కొడుకును ఎవరు గెలిపించారో అందరికీ తెలుసు: అడ్లూరి లక్ష్మణ్
మన తెలంగాణ / హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీలో మంత్రుల మధ్య నెల కొన్న వివాదం ఓ పట్టాన విడిచేటట్టు లేదు. వివాదం సమసిపోయిందని ప్రకటించినా మళ్లీ ఒకరిపై ఒక రు బహిరంగ వ్యాఖ్యలు చేసుకుంటూనే ఉ న్నారు. తాజాగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వివాదం సమసిపోయిందంటూనే వివేక్‌పై మండిపడ్డారు. ఎవరు ఎవరిని అవమానిస్తున్నారో చర్చకు సిద్దమని ఫైర్ అయ్యా రు.
కులం ఆధారంగా తనపై కుట్రలు, విమర్శలు చేస్తున్నారని, చేయిస్తున్నారని మంత్రి వివేక్ వెంకటస్వామి వ్యాఖ్యలు చేసిన విష యం తెలిసిందే. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ను రెచ్చగొట్టి తనపై విమర్శలు చేస్తున్నారని, మంత్రి లక్ష్మణ్ నాపై ఎందుకు విమర్శలు చేస్తున్నారో తెలియట్లేదు, సభలు, సమావేశాలు జరిగే సమయంలో ఆయన వచ్చినప్పుడు నేను వెళ్లిపోతున్నాననేది తప్పని, లక్ష్మణ్‌ను రాజకీయంగా ప్రోత్సహించింది మా నాన్నే, ఆ విషయాన్ని అడ్లూరి మర్చిపోయారని వివేక్ చేసిన వ్యాఖ్యలు జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలిస్తే వ్యక్తిగతంగా నాకు మంచి పేరు వస్తుందనే ఈ కుట్ర చేస్తున్నారని ఆయన మండిపడడంపై అడ్లూరి స్పందించారు.
ఆదివారం సాయంత్రం ఆయన ఓ మీడియా ఛానల్ ప్రతినిధితో మాట్లాడుతూ ముగిసిన వివాదాన్ని వివేక్ మళ్లీ తెరమీదకు తెస్తున్నారని, ఇక నేను ఏం మాట్లాడనని అన్నారు. వివేక్ అంశాన్ని అధిష్టానం చూసుకుంటుందని, వివేక్ వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని అంటూనే వివేక్ కొడుకును ఎంపీగా గెలిపించింది ఎవరో ఆయనకు కూడా తెలుసని అన్నారు.