దుర్గాపూర్‌లో మెడికో రేప్ కేసుపై సిఎం మమతా బెనర్జీ వివాదాస్పద వ్యాఖ్యలు
ఆడపిల్లలను అర్ధరాత్రి బయటకు పంపొద్దంటూ హితవు
కోల్‌కతా: దుర్గాపూర్‌లోని ఓ ప్రైవేటు మెడికల్ కాలేజీలో ఓ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం పట్ల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆదివారం నాడు తీవ్రంగా స్పందించారు. రాత్రిళ్లు విద్యార్థినులను వెలుపలకు వెళ్లేందుకు అనుమతించరాదని స్పష్టం చేశారు. రాత్రి 12-30 గంటల సమయంలో ఆమె ఎందుకు కాలేజీ ప్రాంగణం నుంచి బయటకు వెళ్లారని ప్రశ్నించారు. ఆ విద్యార్థిని బాధ్యత పూర్తిగా ప్రైవేటు మెడికల్ కాలేజీదేనని స్పష్టం చేశారు. ప్రతివిషయానికీ తమ ప్రభుత్వాన్ని నిందించడం సబబు కాద ని మమత పేర్కొన్నారు.
ఈ ఘటన పట్ల మమతా బెనర్జీ దిగ్భ్రమ వ్యక్తం చేశారు. ఈ దారుణానికి పాల్పడిన ఎవ్వరినీ క్షమించబోమని హెచ్చరించారు. రాత్రి పూట ఆడపిల్లలు బయటకు వెళ్లనివ్వకూడదు. వారు కూడా తమ భద్ర త విషయంలో జాగ్రత్త తీసుకోవాలని హితవు చెప్పారు. అత్యాచారం జరిగిన ప్రతి సందర్భంలోనూ, రాష్ట్ర ప్రభుత్వా న్ని ఎందుకు బదనాం చేస్తున్నారని మ మత ప్రశ్నించారు. నెల్లాళ్ల క్రితం ఒడిశాలోని పూరీ బీచ్‌లో ఓ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ జరిగిన ఘటనను ప్రస్తావిస్తూ, ఒడిశా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందని ఆమె ప్రశ్నించారు. శుక్రవారం నాడు కోల్ కతాకు 170 కిలోమీటర్ల దూరంలోని దుర్గాపూర్‌లోని ఓ ప్రైవేటు మెడికల్ కాలేజీలో ఎంబిబిఎస్ రెండో సంవత్సరం చదువుతున్న 23 ఏళ్ల విద్యార్థినిపై ఆ స్పత్రి వెనుక ఏకాంత ప్రదేశంలో సామూహిక అత్యాచారం జరిగింది.
ఒడిశాకు చెందిన ఆ బాలిక తల్లిదండ్రులు దుర్గాపూర్ చేరుకుని న్యూ టౌన్ షిప్ పో లీసు స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. తన బిడ్డకు బెంగాల్‌లో రక్షణ లేద ని, ఆ మెను తమ రాష్ట్రానికి తీసుకుపోతామని ఆమె తండ్రి పేర్కొన్నారు. ఆదివా రం తెల్లవారుజామున ఈ సామూహిక అత్యాచారానికి సంబంధించి షేక్ రి యాజ్ ఉద్దీన్, షేక్ ఫిర్దౌష్, అప్పు అనే ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి అనుమానంతో మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.