విశాఖ స్టీల్ ప్లాంట్‌లో మరోసారి అగ్ని ప్రమాదం జరిగింది. కోకోవెన్ బ్యాటరీ-5లో ఈ ప్రమాదం సంభవిచింది. లాడీల్ నుంచి ఉక్కు ద్రావకాన్ని తలరిస్తుండగా.. అకస్మాత్తుగా అది లీకై నేలపాలైంది. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. వెంటనే సిబ్బంది అప్రమత్తమై అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. ఫైర్ సిబంబంది అక్కడకు వచ్చి మంటలను అదుపు చేశారు. సకాలంలో స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే ఈ ఘటనలో యంత్ర సామాగ్రికి గణనీయమైన నష్టం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు.