మన తెలంగాణ/హైదరాబాద్ :బిసి రిజర్వేషన్లపై హైకోర్టు ‘స్టే’ విధించడం తో ఈ నెల పదమూడున (సోమవారం) సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై సిఎం రేవం త్‌రెడ్డి, ఏఐసిసి నాయకురాలు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ మీ నాక్షి నటరాజన్, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కు మార్ గౌడ్ ఇంకా పలువురు మంత్రులు జూమ్ మీటింగ్ ద్వారా చర్చించా రు. సుప్రీం కోర్టు ప్రముఖ న్యాయవాది అభిషేక్ సింఘ్విని కూడా జూమ్ మీటింగ్‌లోకి తీసుకుని అభిప్రాయాన్ని తీసుకున్నారు. రిజర్వేషన్లపై ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సుప్రీం కోర్టును ఆశ్రయించాలని వారు ని ర్ణయించారు. సోమవారం సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని ఏకాభిప్రాయానికి వచ్చారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై, నా మినేషన్ల దాఖలవుతున్న సమయంలో హైకోర్టు జోక్యం చేసుకుని ‘స్టే’ వి ధించడం స రైంది కాదని, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జివో నెం. 9 ప్ర కారం ఎన్నికల ప్రక్రియ కొనసాగించుకోవడానికి అనుమతించాలని కోరాలని నిర్ణయించారు. ‘స్టే’ని ఎత్తివేయించగలగితే
స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ సీట ను సునాయసంగా కైవసం చేసుకోవడానికి మార్గం సుగ మం అవుతుందని వారు ఈ భావించినట్లు తెలిసింది. న్యాయవాది అభిషేక్ సింఘ్వి మాట్లాడుతూ సుప్రీం కోర్టులో దాఖలు చేసే స్పెషల్ లీవ్ పిటిషన్‌కు సంబంధించిన వివరాలు తెలిపారు.బిసి రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే ఎన్నికలకు వెళ్ళాలని మొదటి నుంచి తాము హామీ ఇస్తూ వచ్చామని, ఈ మేరకే జివో కూడా విడుదల చేయడం జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూమ్ మీటింగ్‌లో వ్యాఖ్యానించారు. కాబట్టి దీనిపై ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా రిజర్వేషన్లు కల్పించేందుకు అన్ని విధాలా పోరాటం చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని అన్నారు. కోర్టులో నిలబడదని తెలిసి కూడా ప్రభుత్వం జివో జారీ చేసిందన్న విపక్షాల విమర్శలను ఎక్కడికక్కడ తిప్పి కొట్టాలని ఆయన మంత్రులకు సూచించారు. మీనాక్షి నటరాజన్ కల్పించుకుని ప్రభుత్వ చిత్తశుద్ధిని ఎవరూ శంకించడం లేదని అన్నారు. మీరు ఎంతో కృషి చేశారని, ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారని, ఇంకా హైకోర్టు స్టే ఇవ్వకుండా ముందుగానే సుప్రీం కోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేయించారని వీటన్నింటినీ బిసిలు తప్పకుండా గుర్తు పెట్టుకుంటారని ఆమె తెలిపారు.
ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం ఎంతో సీరియస్‌గా ప్రయత్నిస్తున్నదని బిసిలు అర్థం చేసుకున్నారని చెప్పారు. తనకు వందలాది ఫోన్లు వస్తున్నాయని, ప్రభుత్వం చేసిన కృషిని అభినందిస్తున్నారని ఆయన తెలిపారు. విపక్షాలు చేసే విమర్శలను తాను ఇంకా మంత్రులు ఎప్పటికప్పుడు తిప్పి కొడుతున్నామని ఆయన చెప్పారు. జిల్లా పార్టీ నాయకులు కూడా స్థానికంగా విలేకరుల సమావేశాల్లో, సభలు, సమావేశాల్లో ప్రభుత్వం చేసిన కృషిని చెబుతున్నారని ఆయన వివరించారు. కేంద్రంలో బిజెపి సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం అడ్డుపడుతున్నదని, దీనికి బిఆర్‌ఎస్ బాసటగా నిలుస్తున్నదని ఆరోపించాలని జిల్లా పార్టీ నాయకులకు సూచించినట్లు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.