హైదరాబాద్: పంజాగుట్టలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ ను లారీ ఢీకొట్టడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. హెవీ వెహికల్స్ భాగ్యనగరం లోపలికి రావడం ఏంటని నెటజన్లు ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్ లోకి లారీలను రానివ్వొద్దని నెటిజన్లు కోరుతున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.