ఆమెరికా: దక్షిణ కాలిఫోర్నియాలోని ఓ ప్రముఖ బీచ్ సమీపంలో హెలికాఫ్టర్ ప్రమాదానికి గురైంది. అందరూ చూస్తుండగానే హెలికాఫ్టర్ కుప్పకూలిపోయింది. అప్పటివరకూ సాధారణంగా ప్రయాణించిన హెలికాఫ్టర్.. ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి అదుపు తప్పింది. కాసేపటికే అక్కడ ఉన్న చెట్లలో కూలిపోయింది. ఈ ఘటనలో హెలికాఫ్టర్‌లో ఉన్న ఇద్దరికి, నేలపై ఉన్న మరో ముగ్గరికి గాయలయ్యాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రకి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.