ఎల్‌బినగర్: రంగారెడ్డి జిల్లా ఎల్‌బి నగర్ ప్రాంతం బిఎన్ రెడ్డి నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్రంగూడ వద్ద థార్ కారు బైక్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారు. డీవైడర్ దాటి మరో కారును ఢీకొట్టడంతో కారు మూడు పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. థార్ కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్టు గుర్తించారు. కారు యజమాని అనిరుధ్, దినేష్, శివ కూడా త్రీవంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలి యాల్సి ఉంది. అతివేగంతో పాటు మద్యం మత్తే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.