న్యూఢిల్లీ: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో యువ క్రికెటర్ యశస్వీ జైస్వాల్ తృటిలో డబుల్ సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. 175 పరుగుల వద్ద రనౌట్ అయ్యాడు. నాన్ స్ట్రైకర్‌లో ఉన్న శుభ్‌మాన్ గిల్‌తో సమన్వయ లోపం కారణంగా రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత ఎంతో అసహనంతో మైదానాన్ని వీడాడు. జైస్వాల్ రనౌట్ పట్ల సోషల్‌మీడియాలో గిల్‌పై విమర్శలు కూడా వచ్చాయి. అయితే రెండో రోజు ఆట ముగిసిన తర్వాత తన రనౌట్‌పై జైస్వాల్ స్పందించాడు.
‘‘నేనెప్పుడూ నాకు వీలైనంత ఎక్కువసేపు ఆడేందుకు ప్రయత్నిస్తాను. రనౌట్లు అనేవి ఆటలో భాగం. పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ రోజు ఆట ప్రారంభంలో పిచ్ కొంచెం బౌలింగ్‌కు అనుకూలించింది. ఒక గంట క్రీజ్‌లో నిలదొక్కుకుంటే ఆ తర్వాత తేలిగ్గా పరుగులు వస్తాయని భావించా. నేను ఏం చేయగలను. జట్టు లక్ష్యాలేంటి అని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటా. వీలైనంత ఎక్కువ సమయం బ్యాటింగ్ చేయడంపై దృష్టిపెడతా. ఇప్పుడు పిచ్ బౌలింగ్‌కు అనుకూలిస్తోంది. మా బౌలర్లు బాగా బౌలింగ్ చేస్తున్నారు. సాధ్యమైనంత తొందరగా విండీస్‌ను ఆలౌట్ చేసేందుకు ప్రయత్నిస్తాం’’ అని జైస్వాల్ అన్నాడు.