న్యూఢిల్లీ : నోబెల్ శాంతి బహుమతి పొందాలన్న డోనా ల్డ్ ట్రంప్ ఆశలు కల్లలయ్యాయి. వెనిజువెలాకు చెందన ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరీచా మచాడోను 2025 నోబెల్ శాంతి బహుమతి వరించింది. వెనిజులా లో ప్రజాస్వామ్యం,మానవహక్కులకోసం, దేశంలో నిరంకుశ పాలనను అంతం చేసేందుకు శాంతియుత పోరాటానికి నాయకత్వం వహించిన ఉక్కుమహిళ ప్రతిపక్షనాయకురాలికి నోబెల్ శాంతి బహుమతి లభించిం ది. టైమ్ మ్యాగజైన్ 2025 ప్రపంచంలో 100 మంది అత్యంత ప్రతితభావంతమైన వ్యక్తుల జాబితాలో కూడా ఆమె స్థానం సంపాదించుకున్నారు. వెనిజువెలా ప్ర స్తుత అధ్యక్షుడు నికోలస్ మదురో గత సంవత్సరం ఎ న్నికలలో రిగ్గింగ్ చేసి గెలిచారని చేసిన తర్వాత ప్రతిపక్షనేత 58 ఏళ్ల మరియా కొరిచా మచాడో అజ్ఞాతం లో ఉన్నారు.నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించిన నర్వేజియన్ నోబెల్ కమిటీ చైర్మన్ జోర్గెన్ వాట్నే ఫ్రై డ్నెస్ శుక్రవారం ఓస్లోలో విలేకరులతో మాట్లాడారు. వెనిజువెలాలో ప్రజాస్వామ్య ఉద్యమ నాయకురాలిగా, మారియా కొరీనా మచాడో ఈ మధ్యకాలంలో లాటిన్ అమెరికాలో అత్యంత ధైర్య
సాహసికురాలిగా నిలిచారు. వెనిజువెలా ప్రజల ప్రజాస్వామ్య హక్కులను ప్రోత్సహించడానికి, నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్యానికి న్యాయంగా, శాంతియుతంగా పరివర్తన సాధించడానికి ఆమె చేసిన పోరాటానికి గానూ ఆమె నోబెల్ శాంతి బహుమతికి ఎన్నికయ్యారని ఆయన అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 8 యుద్ధాలను పరిష్కరించినందుకు నోబెల్ శాంతి బహుమతి పొందేందుకు తానే అర్హుడిని అని పదేపదే వాదిస్తున్న అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ కు ఈ పరిణామం నిస్సందేహంగా కలవరపెడుతింది. అయితే మచాడో ఎంపిక ఆయనను బాధించకపోవచ్చు. ఈ మధ్య కాలంంలో వెనిజువెలా మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కార్యకలాపాలపై ట్రంప్ మదురోకు వ్యతిరేకంగా ఓ ఫ్రంట్ ను తెరిచారు.
అన్ని దౌత్య ప్రయత్నాలను నిలిపివేశారు. ట్రంప్ చర్యలు వెనిజువెలా దేశంలో పాలన మార్పుకోసం అమెరికా ఒత్తిడి తీసుకురావచ్చుననే ఊహాగానాలకు ఆజ్యం పోసింది. వెనిజువెలా ప్రతిపక్షనేత మరియా కొరిచా మచాడో కొద్దికాలం క్రితం ఒక ట్వీట్ చేస్తూ తమ దేశంలో చట్టవిరుద్ధంగా అధికారాన్ని హస్తగతం చేసుకున్న నేరస్థులు, టెర్రరిస్ట్ సంస్థను కూల్చివేసేందుకు దృఢమైన, నిర్ణయాత్మక మైన చర్యలు తీసుకున్నందుకు ప్రెసిడెంట్ ట్రంప్, ఆయన అడ్మినిస్ట్రేషన్ కు వెనిజువెలా ప్రజల తరుపున కృతజ్ఞతలు చెప్పారు. ఆల్ఫ్రెడ్ నోబెల్ చెప్పినట్లు నోబెల్ శాంతి గ్రహీత కావడానికి మచాడోకు అన్ని అర్హతలు ఉన్నాయని, ఆమె ఆ అర్హతలు నెరవేర్చారారని నోబెల్ కమిటీ చైర్మన్ ఫ్రైడ్నెస్ అన్నారు. శాంతి బహుమతి గ్రహీత ఎంపిక కోసం ఆల్ఫ్రెడ్ నోబెల్ వీలునామాలో పేర్కొన్న మూడు ప్రమాణాలను మారియా కొరీనా మచాడో తీరుస్తున్నారు. ఆమె దేశంతో ప్రతిపక్షాలు అన్నింటినీ ఏక తాటిపైకి తెచ్చారు. వెనిజువెలా సమాజం సైనికీకరణను ప్రతిఘటించడంలో ఆమె ఎన్నడూ వెనుకంజ వేయలేదు. ప్రజాస్వామ్యానికి శాంతియుత పరివర్తనకు ఆమె స్థిరంగా మద్దతుగా నిలిచారు అని ఫ్రైడ్నెస్ అన్నారు.