మేష రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన ప్రతి పనిలో అవకాశాలు కలిసి వస్తాయి. ఏ పని మొదలుపెట్టిన నిదానంగా సాగుతున్నప్పటికీ ఫలితాలు మాత్రం అనుకూలంగా వస్తాయి.ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. ఎలినాటి శని నడుస్తున్నప్పటికీ అనుకూల ఫలితాలే ఎక్కువగా ఉంటాయి. 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి. వివాహానికి సంబంధించిన విషయాలలో సొంత నిర్ణయాలు పనికిరావు. పెద్దవాళ్ల సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళండి మంచి ఫలితాలు ఉంటాయి. విదేశాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు కొంత నిరాశ పరుస్తాయి. వృత్తి ఉద్యోగాలపరంగా చిన్నచిన్న అవరోధాలు ఏర్పడుతాయి. తొందరపాటు నిర్ణయాల వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. విద్యార్థినీ విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ప్రతిరోజు కూడా ఓం నమశివాయ వత్తులతో దీపారాధన చేయండి అలాగే సోమవారం రోజు శనివారం రోజు శివాలయంలో రుద్రాభిషేకం చేయించడం వలన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆరోగ్యం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాలలో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు గ్రీన్.
వృషభ రాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇంట బయట కొన్ని వివాదాలు ఏర్పడతాయి. వచ్చిన ఆదాయం ఖర్చులు సమానంగా ఉంటాయి. ఖర్చులను అదుపు చేయడంలో విఫలమవుతారు. అవసరానికి స్నేహితులు సహాయ సహకారాలు అందిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో ఏర్పడిన సమస్యలను తెలివిగా పరిష్కరించు కుంటారు. సంతాన పరంగా కూడా కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. వ్యాపారం యొక్క అభివృద్ధి బాగుంటుంది. వివాహనికి సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి. ఉద్యోగ పరంగా మంచి పేర్లు ప్రఖ్యాతలు వస్తాయి. బంధుమిత్రులతో చిన్నచిన్న విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. అప్పు ఇవ్వడం తీసుకోవడం రెండూ కలిసి రావు. స్థలం అమ్మడానికి మీరు చేస్తున్న ప్రయత్నాలు ఈ వారం ఫలిస్తాయి. అందరినీ అతిగా నమ్మడం మంచిది కాదు. వైద్య వృత్తిలో ఉన్న వారికి హోటల్ వ్యాపారస్తులకు పౌల్ట్రీ వ్యాపారస్తులకు చిరు వ్యాపారస్తులకు అందరికీ అనుకూలంగా ఉంది. సినీ పరిశ్రమలో ఉన్న వారికి కూడా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ప్రతిరోజు కూడా ఓం నమో నారాయణ వత్తులతో దీపారాధన చేయండి. ప్రతిరోజు విష్ణు సహస్రనామాలు పారాయణ చేయడం వలన మంచి ఫలితాలు పొందగలుగుతారు. శత్రువులు ఎక్కడో ఉండరు మన పక్కనే ఉంటారనే విషయాన్ని ఈ వారం గ్రహిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసే వచ్చే సంఖ్య నాలుగు కలిసి వచ్చే రంగు బ్లూ.
మిధున రాశి వారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యమైన ప్రయాణాలు వాయిదా పడతాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి పెడతారు. ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా ఎదగడానికి కొన్ని అవకాశాలు లభిస్తాయి. నిరుద్యోగులు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. మొండి బాకీలు వసూలు అవుతాయి. మీరు సొంతంగా తీసుకునే నిర్ణయాల వలన లాభపడతారు. గృహ నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. రాజకీయాలలో ప్రత్యక్షంగా పాల్గొంటారు. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. వివాహానికి సంబంధించిన వ్యవహారాలు సానుకూల పడతాయి. మంచి సంబంధం కుదురుతుంది. జీవిత భాగస్వామితో సఖ్యత ఏర్పడుతుంది. నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి రావు. ఉద్యోగ ప్రయత్నాలలో ఏర్పడిన అవరోధాలు తొలగిపోతాయి. ప్రతిరోజు కూడా హనుమాన్ వత్తులతో దీపారాధన చేయండి. అలాగే హనుమాన్ చాలీసా ప్రతిరోజు చదవడం వలన అద్భుతమైన ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6 కలిసి వచ్చే రంగు మెరూన్.
కర్కాటక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. కోపాన్ని అదుపులో పెట్టుకోవడం వలన చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. అమ్మకాలు కొనుగోలులో లాభపడతారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి మీరు ఆశించిన లాభాలు అందుకోగలుగుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ప్రభుత్వ పరంగా రావలసిన బెనిఫిట్స్ అందుతాయి. నూతన రుణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వాహన యోగం ఉంది. ఉద్యోగ పరంగా స్థిరత్వం ఏర్పడుతుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. రాజకీయాలలో ప్రత్యక్షంగా పాల్గొంటారు. మేధా దక్షిణామూర్తి రూపుని మెడలో ధరించండి. రుణ సంబంధిత సమస్యల వలన ఒత్తిడి తప్పకపోవచ్చు. పునర్వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. సంతానం యొక్క ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు అవసరం అవుతాయి. విదేశాలకు వెళ్లడానికి మీరు చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారాలలో మీరు అనుకున్న అంచనాలను అందుకోగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి అలాగే కుబేర కుంకుమతో అమ్మవారికి అర్చన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య అయిదు కలిసి వచ్చే రంగు తెలుపు.
సింహ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఖర్చులు ఆకాశాన్ని అంటుతాయి. ఆదాయ మార్గాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. శుభకార్యాల నిమిత్తం ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తారు. ముఖ్యమైన పనులను రహస్యంగా చక్కబెడుతారు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించండి. జీవిత భాగస్వామితో స్వల్ప విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. నూతన వ్యాపారం ప్రారంభించడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాల కంటే మీరు సొంతంగా చేసుకునే వ్యాపారాలలో కలుసుబాటు ఎక్కువగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి హోటల్ రంగంలో ఉన్నవారికి చిరు వ్యాపారస్తులకు ఈ వారం లాభాలు బాగుంటాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయం మరియు శని గ్రహ స్తోత్రాన్ని పఠించండి. మంగళవారం మరియు శనివారం రోజున నలుపు వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఒకటి కలిసి వచ్చే రంగు తెలుపు.
కన్యా రాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి సైనస్ కిడ్నీ ఇన్ఫెక్షన్ చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం తొలగిపోయే అవకాశం ఉంది. ప్రేమ వివాహాలు కలిసి రావు. వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగా ఉంటుంది. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. ఆత్మీయులతో కీలక విషయాల గురించి చర్చిస్తారు. విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు కుదురుతాయి. వైద్య వృత్తిలో ఉన్నవారికి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, హోటల్ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు ఉంటాయి. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అప్పు ఇస్తే తిరిగి రాదు. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. వృత్తి ఉద్యోగాలలో ఏర్పడినటువంటి సమస్యల నుండి అధికారుల సహాయంతో బయటపడతారు. స్త్రీలతో విభేదాలు రాకుండా చూసుకోవాలి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. భూ సంబంధిత విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. డబుల్ రిజిస్ట్రేషన్ పట్ల మోసపోయే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి. ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య ఎనిమిది కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ.
తులా రాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. విద్యా ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. వ్యాపారం సానుకూలంగా ఉంటుంది. రావలసిన బెనిఫిట్స్ నిదానంగా చేతికి అందుతాయి. వారాంతంలో మంచి శుభవార్తను వింటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలలో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. ఒక స్థలాన్ని అమ్మి మీకున్న అప్పులన్నీ తీర్చి వేస్తారు. సేవింగ్స్ ఎక్కువగా చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో కొంత జాప్యం కలుగుతుంది. ప్రతిరోజు కూడా జిల్లేడు వత్తులతో దీపారాధన చేయండి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చెడు అలవాట్లకి దూరంగా ఉండటం మంచిది. విద్యార్థిని విద్యార్థులు చదువుపై శ్రద్ధ తగ్గకుండా చూసుకోవాలి. క్షణం తీరిక లేకుండా కాలం గడుపుతారు. కెరియర్ పరంగా మీరు కోరుకున్న స్థిరత్వం లభిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ.
వృశ్చిక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగా ఉంటుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతల కోసం ఎక్కువగా కష్టపడతారు. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీకు ఎంతగానో మేలు చేస్తాయి. సంతానానికి మంచి ఉద్యోగం లభిస్తుంది. చేపట్టిన పనులలో విజయం చేకూరుతుంది. కార్యసిద్ధి కలుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుంది. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. దైవ దర్శనాలు చేసుకుంటారు. ఆరోగ్య పరంగా ఉన్నటువంటి చిన్నచిన్న ఇబ్బందులు తొలగిపోతాయి. దైవ సేవ కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉంటారు. సుబ్రహ్మణ్య స్వామి వారికి ఎక్కువగా ఆరాధన చేయండి సుబ్రహ్మణ్య అష్టకం చదవండి. మీరనుకున్న పనులు సజావుగా సాగుతాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత లోపిస్తుంది. ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. ఆర్థికపరమైన వ్యవహారాలు కొంత చికాకు పరుస్తాయి.ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6 కలిసివచ్చే రంగు డార్క్ రెడ్.
ధనస్సు రాశి వారికి ఈవారం అనుకూలంగా ఉంది. కష్టేఫలి అన్నట్టుగా ఫలితాలు ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. మీ ప్రతిభా పాటవాలు నలుగురిలో మెప్పు పొందుతాయి. సలహాలు ఎవరు చెప్పినా వింటారు మీకు నచ్చినది చేస్తారు. దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు. మీపై పొగడ్తల వర్షం కురిపించే వారిపై జాగ్రత్తవహించండి. నర దిష్టి అధికంగా ఉంటుంది. ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయడం శనికి తైలాభిషేకం చేయడం సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం వలన మంచి ఫలితాలను పొందగలుగుతారు. విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. వ్యాపారాలు కూడా లాభసాటిగా సాగుతాయి. మీకు వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటారు. అధిక శ్రమతో కొన్ని పనులు పూర్తి అవుతాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపార పరంగా లాభాలు ఉన్నప్పటికీ చిన్నపాటి చికాకులు కూడా ఉంటాయి. అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. సంతానం కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నవారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నాలుగు కలిసివచ్చే రంగు తెలుపు.
మకర రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వివాహ ప్రయత్నాలలో జాప్యం ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కొంతమంది భార్యాభర్తల మధ్య గొడవలు శ్రుతిమించుతాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా కాలాన్ని గడుపుతారు. శుభకార్యాలలో పాల్గొంటారు. సేవా కార్యక్రమాలకు మీకు తోచిన సహాయం చేస్తారు. నూతన గృహం కొనుగోలు చేస్తారు. కొన్ని విషయాలలో సొంత నిర్ణయాలు కలిసి రావు. బ్యాంకు లోన్లు మంజూరు అవుతాయి. విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. వ్యవసాయదారులకు గిట్టుబాటు ధర లభిస్తుంది. సంతానం వివాహ విషయంలో చర్చలు సఫలం అవుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ప్రతి పనిలో కూడా మీదే పై చేయి ఉంటుంది. ప్రతిరోజు కూడా అమ్మవారికి ఆరావళి కుంకుమతో పూజ చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చేసరికి 6 కలిసివచ్చే రంగు గ్రీన్.
కుంభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రాశి వారికి ఏలిన నాటి శని నడుస్తుంది కాబట్టి ఆరోగ్య పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సోదరులతో ఏర్పడినటువంటి స్థిరాస్తి వివాదాలు తొలగిపోతాయి. వివాహానికి సంబంధించిన విషయ వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తాయి. మంచి సంబంధం కుదురుతుంది. భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సంతానం అభివృద్ధిలోకి వస్తారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. కొన్ని విషయాలలో అతిగా ఆలోచించడం కూడా మంచిది కాదు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా కొన్ని జాగ్రత్తలు కచ్చితంగా పాటించాలి. విహారయాత్రలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. దూర ప్రాంత ప్రయాణాలు ఎక్కువగా చేయకపోవడం అనేది చెప్పదగిన సూచన. శనికి తైలాభిషేకం చేయించండి అఘోర పాశుపత హోమం చేయించడం వలన మంచిఫలితాలు పొందుతారు. కుటుంబంలో ఐక్యత లోపిస్తుంది. శనేశ్వరుడికి నలుపు వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య మూడు కలిసి వచ్చే రంగు స్కై బ్లూ.
మీన రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. ఈ రాశి వారికి ఏలిననాటి శని నడుస్తుంది. జీవిత భాగస్వామితో సఖ్యత లోపిస్తుంది. చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. మనోధైర్యం కలిగి ఉంటారు. విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఎప్పటినుండో అమ్ముడు పోకుండా ఉన్నటువంటి స్థలం ఈవారం అమ్ముడు పోతుంది ఆ వచ్చిన డబ్బులతో అప్పులన్నీ తీర్చే వేస్తారు. ప్రశాంతమైన జీవితం గడపడానికి ఇష్టపడతారు. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సంతాన పరంగా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుండి ఉపశమనం పొందుతారు. స్నేహితులను ఎక్కువగా నమ్మవద్దు. వ్యాపార వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. విద్యార్థిని విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించాలి. కీలక వ్యవహారాలలో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి దైవదర్శనాలు చేసుకుంటారు వృత్తి ఉద్యోగాలలో హోదా పెరుగుతుంది. వ్యాపారంలో వచ్చిన లాభాలను పెట్టుబడిగా పెడతారు. ఆర్థిక లావాదేవీలు నిలకడగా ఉంటాయి. శనికి తైలాభిషేకం చేయించండి కాలభైరవ రూపు మెడలో ధరించండి. ముఖ్యమైన విషయాలలో కుటుంబ సభ్యులతో చర్చించకుండా నిర్ణయాలు తీసుకోవడం అనేది మానుకోవాలి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు బ్లూ.