న్యూఢిల్లీ: టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసన ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు. శనివారం మోడీతో రామ్ చరణ్ దంపతులు భేటీ అయ్యారు. ఇటీవల ఢిల్లీలో ఆర్చరీ లీగ్ మొదలైంది. ఈ కార్యక్రమాన్ని రామ్ చరణ్ లాంచ్ చేశారు. ఆ లీగ్ సక్సెస్ అయిన సందర్భంగా మోడీని కలిసినట్లు రామ్ చరణ్ సోషల్‌మీడియాలో ఆ ఫోటోలను పంచుకున్నారు.
ఆర్చరీ లీగ్ ఈ ఏడాది తొలిసారిగా నిర్వహించారు. ఇందులో మొత్తం ఆరు జట్లు పాల్గొన్నాయి. తెలంగాణ, తమిళనాడు, ఝార్ఖండ్, మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్ టీమ్స్ ఈ లీగ్‌లో పోటీ పడ్డాయి. ఇక సినిమాల విషయానికొస్తే.. రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో ‘పెద్ది’ అనే సినిమాలో నటిస్తున్నారు. జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్. ఇప్పటికే వచ్చిన పెద్ది ఫస్ట్ షాట్ అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చింది. విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. వచ్చే ఏడాది సమ్మర్‌లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.