అమరావతి: భర్తను భార్య వదిలేసి పారిపోవడంతో అతడిని చూసి బాలుడు నవ్వాడు. దీంతో సదరు వ్యక్తి బాలుడి మెడపై నరకడంతో ఘటనా స్థలంలోనే చనిపోయాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా రేణిగుంట ప్రాంతం సంత సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గువ్వల కాలనీలో మేస్త్రీ అనే వ్యక్తి పూసలను అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతడి భార్య ఇంట్లో నుంచి వెళ్లిపోవడంతో మేస్త్రీని చూసి గ్రామస్థులు నవ్వేవారు. బుధవారం మేస్త్రీ వెళ్తుండగా శ్రీహరి(17) అనే బాలుడు నవ్వాడు. దీంతో అతడు శ్రీహరిని చితకబాదాడు. బాలుడు తన తండ్రిని తీసుకొని మేస్త్రీ వద్దకు వెళ్లి గొడవకు దిగారు. ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో మేస్త్రీ కత్తి తీసుకొని శ్రీహరి మెడపై నరికాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.