ఢిల్లీ: అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ రెండో రోజు లంచ్ సమయానికి టీమిండియా 116 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 427 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. రెండో రోజు యశస్వి జైస్వాల్ 175 పరుగులు చేసి రనౌట్ రూపంలో మైదానం వీడాడు. నితీష్ కుమార్ రెడ్డి 43 పరుగులు చేసి వరికన్ బౌలింగ్‌లో జయ్‌డెన్ సీల్స్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. మొదటి రోజు కెఎల్ రాహుల్(38), సాయి సుదర్శన్(87) పరుగులు చేసి ఔటైన విషయం తెలిసిందే. ప్రస్తుతం క్రీజులో శుభ్‌మన్ గిల్ (75), ధృవ్ జురెల్ (07) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. విండీస్ బౌలర్ వరికన్ మూడు వికెట్లు తీశాడు. తొలి టెస్టులో భారత్ ఘన విజయం సాధించి ఈ సిరీస్ లో 1-౦ తో ముందుంజలో ఉంది.