హైదరాబాద్: టి స్క్వేర్ లో ఆపిల్ వంటి అంతర్జాతీయ సంస్థల ఔట్ లెట్లు ఉండాలని సిఎం రేవంత్ రెడ్డి అధికారులకు తెలిపారు. నవంబర్ నెలాఖరుకు నిర్మాణ పనులు ప్రారంభించాలని అన్నారు. ఐసిసిసిలో ఎఐ హబ్, టి స్క్వేర్ పై సిఎం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టి స్క్వేర్ నిర్మాణం తెలంగాణ ఐకానిక్ గా ఉండాలని, ఎఐ హబ్ తాత్కాలిక ఏర్పాటు కోసం ఇంజనీరింగ్ కోసం స్టాఫ్ కాలేజ్ ను పరిశీలించాలని సూచించారు. ఎఐ హబ్ కోసం కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాలని, ప్రముఖ ఎఐ సంస్థల ప్రతి నిధులతో బోర్డు ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు.