కోల్‌కతా: టీమిండియా వన్డే కెప్టెన్సీ బాధ్యతలను శుభ్‌మన్ గిల్‌కు అందించడాన్ని భారత మాజీ సారథి సౌరవ్ గంగూలీ స్వాగతించాడు. రోహిత్ శర్మ స్థానంలో గిల్‌కు పగ్గాలు అప్పగించడం మంచి నిర్ణయమేనని అభిప్రాయపడ్డాడు. యువ ఆటగాడు గిల్‌కు ఎంతో భవిష్యత్తు ఉందని, అతనికి అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించడం ఖాయమని జోస్యం చెప్పాడు. రోహిత్‌ను కావాలనే కెప్టెన్సీ తప్పించారని కొంత మంది చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నాడు. జట్టు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సెలెక్టర్లు ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉంటారని పేర్కొన్నాడు. రోహిత్‌ను తప్పించారనే ప్రచారాన్ని తప్పుపట్టాడు. పరస్పర అంగీకారంతోనే కెప్టెన్సీ మార్పు జరిగి ఉంటుందని గంగూలీ వివరించాడు. రోహిత్‌ను కావాలనే కెప్టెన్సీ నుంచి తప్పించారని కొంత మంది మాజీ క్రికెటర్లు వాదించడంలో ఎలాంటి పసలేదన్నాడు. జట్టు భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకునే యువకుడైన గిల్‌కు వన్డే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించి ఉంటారని గంగూలీ వ్యాఖ్యానించాడు.