గత ఏడాది ‘క’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న యువ నటుడు కిరణ్ అబ్బవరం. ఈ ఏడాది మార్చిలో ‘దిల్ రుబా’ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. కానీ, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. దీంతో ఈసారి గట్టిగా సక్సెస్‌ని అందుకోవాలనే ఉద్దేశ్యంతో ‘కె-ర్యాంప్’ సినిమాతో ముందుకొచ్చాడు. కొద్ది రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా టీజర్ ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు.
ట్రైలర్ ఆద్యంతం కామెడీతో నవ్వులు పూయిస్తోంది. కిరణ్ యాక్టింగ్ చించేశాడని అభిమానులు అంటున్నారు. హీరోయిన్ యుక్తి తరేజా కూడా తన నటనతో మెప్పించింది. ఇక ట్రైలర్‌లో అక్కడక్కడ డబుల్ మీనింగ్ డైలాగ్స్, ముద్దు సీన్లు ఉన్నాయి. ఇక ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 18న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో జోరు పెంచారు. ఈ చిత్రానికి జైన్స్ నాని దర్శకత్వం వహించగా.. చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. రాజేష్ దండా, శివ బొమ్మక్ ఈ సినిమాను నిర్మించారు.