చెన్నై: ధనుష్, నిత్య మీనన్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఇడ్లీ కొట్టు’. అక్టోబర్ 1వ తేదీన ఈ సినిమా విడుదలైంది. ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. తెలుగులో పెద్దగా ఆదరణ లేకపోయినా.. తమిళ ప్రేక్షకులు మాత్రం సినిమాను హిట్ చేశారు. తాజాగా ఈ సినిమా నుంచి ఓ పాటను విడుదల చేశారు. ‘ఎన్న సుగమ్’ అనే పాట వీడియోను వదిలింది చిత్ర యూనిట్.
ఇక ఈ చిత్రాన్ని ధనుష్ స్వయంగా దర్శకత్వం చేశారు. సినిమా ఇప్పటివరకూ రూ.70 కో్ట్ల వసూళ్లు రాబట్టింది. తెలుగులో కూడా చిత్రానికి మంచి స్పందన వస్తే.. వంద కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాకు జీవి ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. ఆకాశ్ బాస్కరన్, ధనుష్ ఈ చిత్రాన్ని నిర్మించారు.