హైదరాబాద్ సిటిలో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టిబడింది. నగరంలోని సుచిత్ర సర్కిల్లో ఉన్న కాకినాడకు చెందిన పిఎన్ఎం లైఫ్ సైన్సెస్ కంపెనీలో ఎఫిడ్రిన్ తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుండి 220 కిలోల ఎఫిడ్రిన్ డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన డ్రగ్స్ విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో రూ. 77 కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.