మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌కు మార్గం సుగ మం అయింది. నోటిఫికేషన్ విడుదలపై స్టే ఇ చ్చేందుకు హైకోర్టు నిరాకరించడంతో షెడ్యూల్ ప్రకారం అక్టోబర్9న యథావిధిగా మొదటి విడ త ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఉదయం 10.30 గంటల నుంచి నామినేషన్‌లు స్వీకరించనున్నారు. తెలంగాణ ఎన్నికల కమిషన్ ప్రకటించిన షెడ్యూల్ ప్ర కారం మొదట ఎంపిటిసి,జెడ్‌పిటిసి స్థానాలకు, ఆ తర్వాత సర్పంచ్, వార్డు సభ్యులకు ఎన్నికలు జరగనున్నాయి. ఐదు దశల్లో జరిగే స్థానిక సం స్థల ఎన్నికల ప్రక్రియ అక్టోబర్ 9వ తేదీన ప్రారంభమై నవంబర్ 11వ తేదీన ముగియనుంది.
రాష్ట్రంలో 31 జిల్లాల్లోని 565 మండలాల్లో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. 5,749 ఎంపిటిసి, 565 జెడ్‌పిటిసి స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. 12,733 గ్రామపంచాయతీలు, 1,12,288 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. తొలి విడత ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం ఉదయం ప్రారంభం కానుండగా, నామినేషన్లకు చివరి తేదీ అక్టోబర్ 11. ఆ తర్వాత రోజు నామినేషన్ల పరిశీస్తారు. అక్టోబర్ 15 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంది. అక్టోబర్ 23వ తేదీన తొలి విడత ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికలు జరుగనున్నాయి. తొలి విడతలో 56 రెవిన్యూ డివిజన్లలో 292 మండలాలలో 2963 ఎంపిటిసి స్థానాలకు ఎన్నికలు జరుగనుండగా, రెండో విడతలో 50 రెవిన్యూ డివిజన్లలో 273 మండలాలలో 2786 ఎంపిటిసి స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. కాగా, స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఇసి) రాణికుముదిని బుధవారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికలకు గురువారం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏర్పాట్లపై కలెక్టర్లతో సమీక్షించారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సజావుగా నామినేషన్ల ప్రక్రియ కొనసాగేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ తెలిపారు.
తొలి విడత ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికలు- షెడ్యూల్