చింతా వరలక్ష్మీ సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ మీద చింతా వినీష రెడ్డి, చింతా గోపాల కృష్ణా రెడ్డి నిర్మాతలుగా వినయ్ రత్నం తెరకెక్కించిన చిత్రం ‘శ్రీ చిదంబరం’. వంశీ తుమ్మల , సంధ్యా వశిష్ట జంటగా నటించిన ఈ చిత్రం నుంచి టీజర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి హీరో సత్యదేవ్, దర్శకులు వశిష్ట, వెంకటేష్ మహా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ ఈవెంట్‌లో దర్శకుడు వశిష్ట మాట్లాడుతూ “శ్రీ చిదంబరం టీజర్ చాలా బాగుంది. ఈ మూవీ పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను” అ ని అన్నారు. నిర్మాత గోపాలకృష్ణ రెడ్డి మాట్లాడుతూ “శ్రీ చిదంబరం’ కథను వినయ్ చెప్పినప్పుడు నాకు చా లా నచ్చింది. కొత్త ఆర్టిస్టులతో సినిమాను తీశాం”అని తెలిపారు. హీరో వంశీ తుమ్మల మాట్లాడుతూ సినిమా అందరికీ నచ్చుతుందని, పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు వినయ్ రత్నం, సందీప్, సుజిత్, ఎదు వంశీ, సా యి మార్తాండ్, సింజిత్, నంద గోపాల్ పాల్గొన్నారు.