తిమ్మాపూర్: వరికోత మిషన్‌ను ఆర్‌టిసి బస్సు ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి రాజీవ్ రహదారిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గుండ్రాత్ సతీష్ అనే వ్యక్తి వరికోత మిషన్‌ను డ్రైవ్ చేసుకుంటూ కరీంనగర్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్నాడు. వరికోత మిషన్‌కు క్లీనర్‌గా గుర్రాల సాగర్ పని చేస్తున్నాడు. తిమ్మాపూర్ శివారులోకి రాగానే వరికోతమిషన్‌ను ఆర్‌టిసి లగ్జరీ బస్సు ఢీకొట్టడంతో గుర్రాల సాగర్ కిందపడి ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన సతీష్‌ను ఆస్పత్రికి తరలించారు. బస్సులో ప్రయాణికులు కూడా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.