మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా తడబడుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత్ వరుస వికెట్లు కోల్పోతోంది. ఇప్పటికే రెండు వరుస విజయాలతో జోరు మీదున్న భారత్ ను దక్షిణాఫ్రికా బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్ బంతులతో బెంబేలెత్తిస్తున్నారు. దీంతో టీమిండియా 100 పరుగులకే సగం వికెట్లు చేజార్చుకుంది.
ఇన్నింగ్స్ ఆరంభంలో శుభారంభం దక్కినా.. తర్వాత క్రమం తప్పకుండా భారత్ వికెట్లను కోల్పోయింది. ఓపెనర్లు స్మృతి మంధానా(23), ప్రతికా రావల్(37)లు భారీ స్కోరు చేయడంలో విఫలమయ్యారు. ఆ తర్వాత వచ్చిన వారు వచ్చినట్లు పెవిలియన్ కు క్యూ కట్టారు. దీంతో భారత్ 102 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. ఈ క్రమంలో అమన్ జ్యోత్ కౌర్, రిచా ఘోష్ లు ఇన్నింగ్స్ ను చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. మరో వికెట్ చేజార్చుకోకుండా జాగ్రత్తగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపిస్తున్నారు. దీంతో ప్రస్తుతం టీమిండియా 33 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది.